నేటి నుంచి నెల్లూరులో వైభవంగా రొట్టెల పండుగ
#ఆంధ్రప్రదేశ్ #రొట్టెల పండుగ #నెల్లూరు #andhrapradesh
నెల్లూరులోని ప్రసిద్ధ బారా షాహీద్ దర్గాలో నేటి నుంచి ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగ వైభవంగా ప్రారంభమైంది. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాల్లో పాల్గొని భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు.
ఉత్సవాల్లో భాగంగా నేడు చందల్‌మౌలి కార్యక్రమం నిర్వహించనుండగా, రేపు గంధం కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 28న ప్రధాన రొట్టెల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం 29న తహలీల్ ఫాతేహా, 30న ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భద్రత కోసం భారీ పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్య సౌకర్యాలను అందుబాటులో ఉంచింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.