సాయికృష్ణకు జనసేనతో సంబంధం లేదని స్పష్టీకరణ
#saikrishna #andhrapradesh #janasena #politics
గాదె సాయికృష్ణ అనే వ్యక్తి జనసేన పార్టీకి చెందినవాడని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని జనసేన పార్టీ అధికారికంగా స్పష్టం చేసింది. సాయికృష్ణకు పార్టీ క్రియాశీలక సభ్యత్వం లేదని, ఆయన ఎప్పుడూ జనసేన నిర్వహించిన కార్యక్రమాలు, సమావేశాలు లేదా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న దాఖలాలు లేవని పేర్కొంది.
అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి అనుబంధంగా ఉన్నవారు కాదని వెల్లడించింది. రాజకీయ పరిస్థితులను బట్టి కొందరు వ్యక్తులు వివిధ పార్టీల్లోకి రావడం, వెళ్లడం సాధారణ విషయమేనని పార్టీ తెలిపింది.
సాయికృష్ణకు సంబంధించిన ఘటనను జనసేనకు అంటగట్టి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఈ అంశంపై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, వాస్తవాలను గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది. ఆధారాలు లేని ఆరోపణలతో పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ప్రయత్నాలను ఖండిస్తున్నట్లు పేర్కొంది.