హీరోస్.. ఫాలో యువ‌ర్ ఫాలోవ‌ర్స్

#Entertainment #allu arjun #Tarak #fans #Heropolitics

Jul 14, 2026 - 18:49
 0  12
హీరోస్.. ఫాలో యువ‌ర్ ఫాలోవ‌ర్స్

హీరో హీరోయిజం చేస్తే ఫాలోయింగ్ పెరుగుతుంది. కాని విల‌నిజం మార్క్ చూపిస్తే ఫ్యాన్స్ త‌ట్టుకోలేరు. ప్ర‌కృతి విరుద్ధంగా న‌డుస్తామంటే మ‌ద్ద‌తు దొర‌క‌దు. లెప్ట్ పార్టీ బిజెపితో పొత్తు అంటే ఎవ‌రూ జీర్ణించుకోలేరు. అలాగే బిజెపి కాంగ్రెస్ క‌లుస్తామంటే అలాగే ఉంటుంది. మ‌న హీరోలు అయినా అంతే. వారు ఎటు వైపు, ఉన్నార‌ని ఫాలోయింగ్ వ‌చ్చిందో.. వారంతా ఎటు తిరిగితే అటు తిరిగేవాళ్లు కాదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. విభ‌జ‌న దెబ్బ‌కు కాంగ్రెస్ దెబ్బ తింది. దేశ‌మంతా బిజెపి వైపు చూస్తున్న స‌మ‌యంలో.. ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చి.. బిజెపికి, టీడీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. వెంట‌నే ప‌వ‌న్ ఫ్యాన్స్ అంతా అటే తిరిగి ఫ‌లితాల‌పై ఎఫెక్ట్ చూపించింది. అదే ప‌వ‌న్ జ‌గన్ కు మ‌ద్ద‌తు ఇచ్చి ఉంటే అది వ‌ర్క‌వుట్ అయ్యేదా? 2019 ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ లెఫ్ట్ పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగారు. కాని ఫ్యాన్స్ఆయ‌న‌కు వేయ‌లేదు.. టీడీపీ మీద వ్య‌తిరేక‌త‌తో ఉన్న వారు వైసీపీకి వేశారు. 2024లో జ‌గ‌న్ పై వ్య‌తిరేక‌త తీవ్రంగా ఉంది కాబ‌ట్టే.. ప‌వ‌న్ ఎత్తుగ‌డ‌ల‌కు ఫ్యాన్స్ నుంచి మ‌ద్ద‌తు ల‌భించింది. అలా ఒరిజిన‌ల్ మార్క్ మ‌ద్ద‌తుతో పాటు ప‌రిస్ధితులు ప్ర‌భావం కూడా ఉంటుంది.. అప్పుడే ఆ నాయ‌కుడు లేదా హీరో తీసుకునే నిర్ణ‌యం వ‌ర్క‌వుట్ అవుతుంది. 

ఇప్పుడు తార‌క్ పార్టీ పెడ‌తాడ‌ని.. వెంట‌నే కాక‌పోయినా ఆ దిశ‌గా అడుగులు వేస్తాడ‌ని టాక్ న‌డుస్తోంది. తార‌క్ మ‌నసులో తాత వారుసుడు అవ్వాల‌ని.. నాయ‌కుడు కావాల‌నే కోరిక ఉన్న మాట అయితే వాస్త‌వం. అత‌ని మాట‌ల్లో చాలాసార్లు బ‌య‌ట‌ప‌డ్డాడు. అయితే టీడీపీ వైపే ఉన్నంత‌కాలం బాగానే ఉన్న తార‌క్ ఫాలోయింగ్... హ‌రికృష్ణ‌, కొడాలి నాని, వంశీల ప్ర‌భావంతో వైసీపీ వైపు చూస్తున్నట్లు అనిపించ‌గానే తేడా వ‌చ్చేసింది. బాగున్న సినిమాకు కూడా క‌లెక్ష‌న్లు రాని ప‌రిస్ధితి చూశాం. అందుకే ఆ త‌ర్వాత తార‌క్ రాజ‌కీయాల ప‌ట్ల మౌనం పాటిస్తూ.. కెరీర్ పైనే ఫోక‌స్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో... సెట్ అయిపోయాడు.. స్టార్ అయిపోయాడు. 

లోకేష్ మంత్రిగా వ‌చ్చి వార‌సుడిగా ఎస్టాబ్లిష్ అవుతున్న క్ర‌మంలో.. వైసీపీ తెలివిగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ను టీడీపీ కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్న‌ట్లుగా కొన్ని చోట్ల బిల్డప్ ఇచ్చింది. అలా టీడీపీ శ్రేణుల్లో క‌న్ ఫ్యూజ‌న్ క్రియేట్ చేయాల‌ని చూసింది. కాని చూస్తుండ‌గానే లోకేష్ ఆఫ్ట‌ర్ చంద్ర‌బాబు అన్న‌ది క్లియ‌ర్ అయిపోయింది.. ముందు పార్టీపై ప‌ట్టు.. ఇప్పుడు ప్ర‌భుత్వంపై ప‌ట్టు లోకేష్ దే అయిపోయింది. దీంతో ఎవ‌రికీ క‌న్ ఫ్యూజ‌న్ లేదు. మ‌రి టీడీపీని డ్యామేజ్ చేయాలంటే ఏదో ఒక‌ట చేయాల‌ని.. అందుకు ఏ అంశం అయినా వ‌దిలిపెట్ట‌కూడ‌ద‌ని వైసీపీ డిసైడ్ అయింద‌ని అర్ధ‌మ‌వుతూనే ఉంది. తార‌క్ లోని నాయ‌క‌త్వ కాంక్ష‌ను వాడాల‌నేది జ‌గ‌న్ ప్లాన్ గా చెప్పుకుంటున్నారు. అయితే ఎప్పుడూ ఎవ‌రినైనా వాడ‌ట‌మే గాని.. త‌న‌తో క‌లుపుకోవ‌డం గాని.. పోటీగా తెచ్చుకోవ‌డం గాని జ‌గ‌న్ చేయ‌డు. కాపుల‌ను రిజ‌ర్వేష‌న్ పేరుతో ముద్ర‌గ‌డ‌ను ముందుకు తోసిన జ‌గ‌నే ఆ రిజ‌ర్వేష‌న్లు లేకుండా చేయ‌డంతో పాటు ముద్ర‌గ‌డ ప‌రిస్ధితి ఏమైందో కూడా చూశాం. 9  

తార‌క్ వ‌స్తే లోకేష్ దెబ్బ తింటాడ‌నేది వారి అభిప్రాయం. లోకేష్ అంటే అసంతృప్తిగా ఉన్న‌వాళ్లు, ఇగో దెబ్బ తిన్న కొంద‌రు సీనియ‌ర్లు కూడా తార‌క్ వ‌స్తే.. లోకేష్ కాస్త దిగొస్తాడ‌ని అనుకుంటున్నారు. కాని తార‌క్ వ‌స్తే టీడీపీకి నాయ‌కుడిగానే రావాలి.. వ‌స్తేనే మ‌ద్ద‌తు వ‌స్తుంద‌నేది కొంద‌రి అభిప్రాయం. తార‌క్ వ‌చ్చి జ‌గ‌న్ కు ఉపయోగ‌ప‌డుతున్నాడ‌నేది అనుమానం వ‌చ్చినా చాలు.. దెబ్బ తింటాడు. కాని టీడీపీలో నాయ‌క‌త్వ స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు గాని.. లోకేష్ మీద వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ప్పుడు గాని.. తార‌క్ కు మంచి అవ‌కాశం ఉంటుంది. టీడీపీని దెబ్బ తీయ‌డానికి తార‌క్ పాలిటిక్స్ ప‌నికి రావు.. కాని టీడీపీని టేకోవ‌ర్ చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన ప‌రిస్ధితులు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ప‌నికొస్తాయి. అంతేగాని టీడీపీని ఓడించ‌డానికో.. జ‌గ‌న్ ను గెలిపించ‌డానికో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అనిపిస్తే మాత్రం తార‌క్ సినిమాల్లో కూడా న‌ష్ట‌పోవ‌డం ఖాయం.

అటు బ‌న్నీ అయినా అంతే. ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీతో వైరం వ‌ల్ల ఆ ప్యాన్స్ దూర‌మ‌య్యారు. వాస్త‌వానికి పుష్ప‌2కు ఆ దెబ్బ ప‌డింది. ఏదో పీఆర్ మ్యేజిక్ తో క‌వ‌ర్ చేసుకున్నారు గాని.. వాస్త‌వానికి తెలుగులో క‌లెక్ష‌న్ల‌కు దెబ్బ ప‌డింది. అలాగే రాజ‌కీయ పార్టీ అంటూ పెడితే ప‌వ‌న్ కు ఉప‌యోగ‌ప‌డేలా చేస్తే త‌ప్పితే వేరే దారి లేదు. తెలంగాణ‌లో రాజ‌కీయం చేస్తామంటే అక్క‌డా యాక్సెప్టెన్సీ ఉండ‌దు. ప‌వ‌న్ క‌ల్యాణ్ కే తెలంగాణ‌లో అతిథి పాత్ర త‌ప్పితే మెయిన్ పాత్ర అంటే కుద‌ర‌దు కూడా. అందుకే బ‌న్నీ చేస్తే గిస్తే ఆంధ్రాలో చేయాలి.. అది కూడా ప‌వ‌న్ కు మ‌ద్ద‌తుగా చేయాలి. అలా హీరోలు పాలోవ‌ర్స్ ను ఫాలో అవ్వాలి త‌ప్పితే.. త‌మ కోరిక‌ల‌క‌నుగుణంగా ఫాలోవ‌ర్స్ ఫాలో అవ్వాలంటే అది అయ్యే ప‌ని కాదు.