ఎస్టేట్ అభివృధే లక్ష్యం- డాక్టర్ ఎ. శ్రీధర్

Special interview with Estate Officer Dr. A Sridhar

Aug 8, 2026 - 11:19
Aug 8, 2026 - 11:29
 0  14
ఎస్టేట్ అభివృధే లక్ష్యం- డాక్టర్ ఎ. శ్రీధర్

కుమార్ చంద్ పుల్లగూర

ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో ఒక ప్రత్యేక స్థానం కలిగిన మున్సిపల్ కార్పోరేషన్ విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్. అదేవిధంగా అతి పెద్ద మున్సిపల్ కార్పోరేషన్ అంటే అది విజయవాడ మున్సిపల్ కార్పోరేషనే. ఎన్నో ఏళ్లుగా విజయవాడ మున్సిపల్ పరిధిలో ఉన్న ఆస్తులను పరిరక్షించుకుంటూ.. ఆయా ఆస్తులపై వచ్చే అద్దెలను వసూలు చేస్తూ.. కార్పొరేషన్ ను అభివృద్ధి చేసే దిశగా మున్సిపల్ అధికారులు ముందుకు వెళ్తున్నారు. కొత్త కొత్త ఆస్తులను అభివృద్ధి చేసే ఆలోచన లేకపోయినా.. ఉన్న ఆస్తులను మాత్రం పరిరక్షించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే.. ఏళ్ళ క్రితం నిర్మించిన భవనాలపై మాత్రమే వాటిపై వచ్చే అద్దెలను వసూలు చేస్తూ ప్రస్తుతం అడుగులు వేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి.. అదేంటంటే.. ప్రభుత్వ ఆస్తులు ఉన్నప్పుడు వాటిని ఏదొక రకంగా దుర్వినియోగం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తూనే ఉంటారు. అందుకే వాటి పరిరక్షణ ఎంతో ముఖ్యం. అందుకే ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న ఎస్టేట్ ఆస్తులను పరిరక్షిస్తూనే.. కార్పొరేషన్ కు ఆదాయాన్ని తేవడంలో అగ్ర భాగాన్ని పోషిస్తున్నారు ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్. విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న ఎస్టేట్ బాధ్యతలను డాక్టర్ ఎ. శ్రీధర్ సమర్ధవంతంగానే ముందుకు తీసుకు వెళుతున్నారన్న కామెంట్స్ ప్రస్తుతం బయట వినిపించడం గమనార్హం. అయితే ఎస్టేట్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీధర్ ఎస్టేట్ అభివృద్ధికి ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అన్న విషయాలను ట్రూ పాయింట్ మీడియాతో పంచుకున్నారు. అవేంటో చూద్దామా..!

ప్రశ్న: 1. మీరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టేట్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించాక ఎస్టేట్ ను ఏ విధంగా అభివృద్ధి చేశారు?

జవాబు: నేను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టేట్ ఆఫీసర్గా బాధ్యత స్వీకరించాక..ఎస్టేట్ లో ఉన్నటువంటి ఆస్తులను వాటిపై వచ్చే ఆదాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. వాటిని పరిరక్షించే దిశగా చర్యలు తీసుకుంటూ ఉన్నాను.

ప్రశ్న 2: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టేట్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులు, నిర్మాణాలపై అద్దెలు సజావుగా వస్తున్నాయా?

జవాబు: అవును, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టేట్ పరిధిలో మొత్తం 58 కాంప్లెక్స్ లు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తులు అదే విధంగా నిర్మాణాలపై అద్దెలు సకాలంలోనే అందుతున్నాయి. అదేవిధంగా ఆయన నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి మరమ్మతులు ఉన్న వాటిని మేము చేస్తున్నాం.

ప్రశ్న: 3- మున్సిపల్ కార్పొరేషన్ ఎస్టేట్ పరిధిలో ఉన్న కొన్ని ఆస్తులు సంబంధించి ఏమైనా లీగల్ సమస్యలు తలెత్తాయా?

జవాబు: ప్రస్తుతం వరకు అటువంటి సమస్యలు పెద్దగా ఏమీ తలెత్తలేదు. అక్కడక్కడ చెదురు మొదురుగా తలెత్తినా.. వాటిని ఇక్కడ నుంచే దిశగా నోటీసులు కూడా ఇస్తున్నాం. 

ప్రశ్న: 4- కరోనా సమయంలో ఎస్టేట్ పరంగా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా?

జవాబు : కరోనా సమయంలో అందరూ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా సమయంలో రావలసిన బకాయిలను కూడా తర్వాత విజయవంతంగా వసూలు చేశాం. 

ప్రశ్న: 5- బుడమేరుకు వరదలు వచ్చినప్పుడు ఎస్టేట్ తరఫున ఎటువంటి సహాయాన్ని అందించారు? 

జవాబు: బుడమేరుకు వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎస్టేట్ కి సంబంధించిన వసూళ్లు ఆగిపోయిన మాట వాస్తవమే.. కానీ తర్వాత అవన్నీ వసూలు అయ్యాయి.

ప్రశ్న: 6- ఎస్టి టు సంబంధించిన ఆస్తులపై ఏమైనా ఆక్రమణలు జరిగాయా?

జవాబు: అటువంటి ఆక్రమణలు ఏవి ఎస్టేట్ కి సంబంధించిన జరగలేదు. అటువంటి అవకాశాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటే ముందుగానే వాటిపై చర్యలు తీసుకుంటున్నాం

ప్రశ్న: 7- ఎస్టేట్ కి సంబంధించిన ప్రభుత్వ గృహాలను దీనికోసం వాడుతున్నారు?

జవాబు: ఎస్టేట్ కి సంబంధించిన ప్రభుత్వ గృహాలను ప్రస్తుతం వాడటం లేదు. అవసరం వచ్చినప్పుడు కచ్చితంగా ప్రభుత్వ అవసరాలకే వాడతాం. 

ప్రశ్న: 8- ఎస్టేట్ ఆఫీసర్ గా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎస్టేట్ అభివృద్ధికి ఎటువంటి లక్షణాలు మీరు సిద్ధం చేసుకున్నారు?

జవాబు: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎస్టేట్ ఆస్తులను పరిరక్షించడం, ఉన్న ఆస్తులపై నిర్మాణాలపై వచ్చే అద్దెలను కచ్చితంగా రాబట్టడం, శానిటేషన్ ఇబ్బందు లేకుండా చేయటం, ప్రభుత్వ గృహాలను ప్రభుత్వ అవసరానికి వాడటం, కొత్త నిర్మాణాలు ఎస్టేట్ పరంగా నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటం.