ఏఈఈ నియామకాల్లో మెరిట్‌కే ప్రాధాన్యం.. దళారులను నమ్మొద్దన్న APSPDCL

#AEE #Recruitment #apspdcl #shivashankarloteti

Jul 16, 2026 - 13:53
 0  1
ఏఈఈ నియామకాల్లో మెరిట్‌కే ప్రాధాన్యం.. దళారులను నమ్మొద్దన్న APSPDCL
ఏఈఈ నియామకాల్లో మెరిట్‌కే ప్రాధాన్యం.. దళారులను నమ్మొద్దన్న APSPDCL

మెరిట్ ఆధారంగానే ఎఇఇ పోస్టుల నియామకం

ఈనెల 20వతేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి

ఆగష్టు 22 నుంచి 29వరకు రాతపరీక్షలు

నియామకాల్లో అవకతవకలకు చోటు లేదు

ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లో ఎపిట్రాన్స్కో, ఎపిజెన్కో, ఎపిఎస్పిడిసిఎల్, ఎపిఇపిడిసిఎల్, ఎపిసిపిడిసిఎల్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా రాతపరీక్షలో మెరిట్ ద్వారానే నియామకాలను చేపట్టడం జరుగుతుందని ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎపిట్రాన్స్కోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 16, టెలికామ్ 10, సివిల్ ఇంజనీర్లు 23 మొత్తం కలిపి 200, ఎపిజెన్కోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 52, మెకానికల్ 21, ఎలక్ట్రానిక్స్ 7, సివిల్ ఇంజనీర్లు 20 మొత్తం కలిపి 100, ఎపిఎస్పిడిసిఎల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 125, టెలికామ్ 4, సివిల్ ఇంజనీర్లు 6 మొత్తం కలిపి 135, ఎపిఇపిడిసిఎల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 128, టెలికామ్ 3, సివిల్ ఇంజనీర్లు 4 మొత్తం కలిపి 135, ఎపిసిపిడిసిఎల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు 56, టెలికామ్ 1, సివిల్ ఇంజనీర్లు 3 మొత్తం కలిపి 60 పోస్టుల నియామకానికి ఆయా సంస్థలు ప్రకటనను జారీ చేయడం జరిగిందన్నారు. నియామక ప్రకటనలో పేర్కొన్న షెడ్యూల్ మేరకే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ నెల 20వతేదీలోగా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. షెడ్యూల్ పేర్కొన్న విధంగానే ఈ యేడాది ఆగష్టు 22వతేదీ నుంచి 29వతేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ షెడ్యూల్ తేదీల్లో ఎటువంటి మార్పు వుండబోదని స్పష్టం చేశారు.

నియామకాల్లో అవకతవకలకు చోటు లేదు:

ఈ నియామక ప్రక్రియలో ఎటువంటి అవకతవలలకు చోటు లేదని, ఈ ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఎఇఇ పోస్టుల నియామక అంశంలో అభ్యర్థులు దళారుల మాటలు, ఇతర అనధికారిక సామాజిక మాధ్యమాల ద్వారా వెలువడే సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని సూచించారు.

స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులు వేగవంతం

ఎపిఎస్పిడిసిఎల్ మొబైల్ యాప్ సరళతరం

సమీక్షా సమావేశంలో సిఎండి శివశంకర్ లోతేటి

ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి కోరారు. తిరుపతిలోని ఎపిఎస్పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం ఉదయం సంస్థ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎండి మాట్లాడుతూ సంస్థ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్వర్క్స్, వీధి దీపాలు తదితర సర్వీసులతోపాటు గృహ విద్యుత్ సర్వీసులకు, ఫీడర్లకు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మొత్తం కలిపి ఇప్పటివరకు 10.50 లక్షల స్మార్ట్ మీటర్లను అమర్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ విద్యుత్ సర్వీసుల విద్యుత్ వినియోగం, బిల్లింగ్ లో పాదర్శకతను పెంపొందించేందుకు వీలుగా స్మార్ట్ మీటర్లను ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లుగా మార్చినట్లు తెలియజేశారు. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులు విద్యుత్ వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవడం, విద్యుత్తు పొదుపు, బిల్లులో ఆదా చేసుకునేందుకు అవకాశం వుంటుందని వివరించారు.

ఎపిఎస్పిడిసిఎల్ మొబైల్ యాప్ సరళతరం

సంస్థ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సౌలభ్యం కోసం అందుబాటులో ఉన్న మొబైల్ ఆప్లికేషన్ ను సరళతరం చేశామని తెలిపారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు విద్యుత్ బిల్లుల చెల్లింపు, పేమెంట్ వివరాలను తెలుసుకోవడంతోపాటు కొత్త సర్వీసులకు దరఖాస్తు చేసుకునే సౌలభ్యం కూడా వుందన్నారు. ఆండ్రాయిడ్ మొబైల్స్ తోపాటు ఐఫోన్ వినియోగదారులు కూడా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలియజేశారు.

సబ్-స్టేషన్ల నిర్మాణ పనులు వేగవంతం

సంస్థ పరిధిలో ఇప్పటికే మంజూరైన సబ్-స్టేషన్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. సబ్-స్టేషన్ల నిర్మాణంలో పరికరాల నాణ్యతను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్(ప్రాజెక్ట్స్ & ఐటి) పి. అయూబ్ ఖాన్, డైరెక్టర్(టెక్నికల్ & హెచ్ఆర్డి) కె. గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు కె. ఆదిశేషయ్య, జె. రమణాదేవి, సిహెచ్ రామచంద్ర రావు, కె. సంపత్ కుమార్, ఎస్. రమణ, జనరల్ మేనేజర్లు శ్రీనివాసులు, జగదీష్, లత, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.