టైమ్స్ స్క్వేర్‌లో మరోసారి కాల్పుల కలకలం.. మైనర్ అరెస్ట్

#America #arest #టైమ్ స్క్వేర్ #అమెరికా #Crime

Jun 19, 2026 - 12:09
 0  1
టైమ్స్ స్క్వేర్‌లో మరోసారి కాల్పుల కలకలం.. మైనర్ అరెస్ట్

న్యూయార్క్ నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం టైమ్స్ స్క్వేర్‌లో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. న్యూయార్క్ నిక్స్ ఛాంపియన్‌షిప్ పరేడ్ ముగిసిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొందరు యువకుల మధ్య జరిగిన గొడవ మొదట వాగ్వాదంగా ప్రారంభమై, అనంతరం కత్తిపోట్ల స్థాయికి చేరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో 17 ఏళ్ల మైనర్ తుపాకీతో కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.

అయితే అదృష్టవశాత్తూ ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇదే వారంలో టైమ్స్ స్క్వేర్ పరిసరాల్లో చోటుచేసుకున్న మూడో కాల్పుల ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజల భద్రత దృష్ట్యా ఆ ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.