నేషనల్ అథ్లెటిక్స్‌లో రోహిత్ యాదవ్ రికార్డు
#rohit yadav #athletics ##National #sports
ఉత్తరప్రదేశ్‌కు చెందిన భారత జావెలిన్ త్రోయర్ రోహిత్ యాదవ్ నేషనల్ ఇంటర్-స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో అద్భుత ప్రదర్శనతో కొత్త రికార్డు సృష్టించారు. ఆయన జావెలిన్‌ను ఏకంగా 87.05 మీటర్ల దూరం విసిరి ఈ ఏడాది ఆసియాలోనే రెండో అత్యుత్తమ త్రోను నమోదు చేశారు. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటిన రోహిత్, భారత అథ్లెటిక్స్‌కు మరో ఆశాకిరణంగా నిలిచారు. ఒలింపిక్ స్వర్ణ విజేత నీరజ్ చోప్రా, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ కిశోర్ జెనా తర్వాత 87 మీటర్ల మార్కును అధిగమించిన మూడో భారతీయ అథ్లెట్‌గా రోహిత్ యాదవ్ చరిత్ర సృష్టించారు. ఆయన ప్రదర్శనపై క్రీడాభిమానులు, మాజీ అథ్లెట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా ఇదే జోరు కొనసాగించి భారతదేశానికి మరిన్ని పతకాలు సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.