మావిగన్..జగన్ కొత్త పికిల్..

Apr 1, 2026 - 17:47
 0  85
మావిగన్..జగన్ కొత్త పికిల్..

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అమరావతి రాజధాని వద్దంటా.. మావిగన్ రాజధాని ముద్దంటా.. చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా.. అధికారం కోల్పోవటానికి ఏ  అంశాలు కారణమో.. అవే అంశాలను వైసీపీ మాజీ మంత్రులు మళ్లీ తెర పైకి తీస్తున్నారు. మెజారిటీ ప్రజలు ఛీ కొట్టి ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడించినా.. వైసీపీ నేతలకు మాత్రం బుద్ధి రాలేదు కదా.. ఈవీఎంలను మార్చి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చారని ఇప్పటికీ కూటమి సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఈవీఎంలను మార్చే విధానం తెలిస్తే తమకు 440 సీట్లు వస్తాయని.. ఎన్నికల ప్రచారంలో మోడీతో పాటు అమిత్ షా చేసిన ప్రసంగాలు నిజమయ్యేయి.

ఇక ఇదంతా పక్కన పెడితే.. తాజాగా జగన్ మరొక రాజధాని పేరును తెర పైకి తెచ్చి సంచలనం లేపారు. అదేమిటంటే.. అమరావతి రాజధాని నిర్మాణానికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని.. కాబట్టి విజయవాడ, మచిలీపట్టణం, గుంటూరు ప్రాంతాల మధ్యలో రాజధానిని నిర్మించి.. దానికి మావిగన్  అనే పేరు పెట్టాలని కోరారు. ఇక్కడ రాజధానిని నిర్మిస్తే కేవలం 10 శాతం అంటే 20 వేల కోట్లు ఖర్చుతో రాజధానిని నిర్మించవచ్చు  అని కూడా జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. అధికారంలో లేనప్పుడు అమరావతి రాజధానికి మద్ధతివ్వటమే కాకుండా.. 30 వేల ఎకరాల భూములను సేకరించాలని సాక్షాతూ అసెంబ్లీలో ప్రసంగించి జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్రికా దేశంలో మూడు రాజధానులు ఎలా ఉన్నాయో.. ఆ విధంగా మూడు రాజధానులను ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. 

పోనీ.. అంతటితో ఆగారా..? మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీ పెట్టి, ఆమోదింప చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇంకేమన్నారంటే.. మళ్లీ తానే అధికారంలోకి వస్తానని.. విశాఖపట్నంలోనే  తాను సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తానన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని  లేకుండా చేసిన ఘనుడిగా జగన్ రెడ్డికి పేరొచ్చింది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటానికి కారణమైన మూడు రాజధానుల విధానాన్ని మళ్లీ తెర పైకి తీసుకురాకున్నా.. కొత్తగా "మావిగన్" అని వింత పేరును తెర పైకి తెచ్చారు. అమరావతి రాజధానే తన ఓటమికి కారణం అయినా కూడా ఇంకా జగన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోలేదని వైసీపీ కార్యకర్తలు, అభిమానులే వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము మళ్లీ అధికారంలోకి వస్తే.. మూడు రాజధానులుగా చట్టం మారుస్తామంటున్నారు వైసీపీ ఉత్తరాంద్ర మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావులు.. మూడు రాజధానులే మా కొంప ముంచిందన్నారు వైసీపీ మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు. మరి "మావిగన్" వైసీపీని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.