హైవేపై దారుణం.. యువతిపై కత్తితో దాడి చేసి పెట్రోల్ బాంబుతో వ్యక్తి ఆత్మహత్య

#karnataka #Crime #పెట్రోల్ #attackswomen

Jun 29, 2026 - 14:24
 0  3
హైవేపై దారుణం.. యువతిపై కత్తితో దాడి చేసి పెట్రోల్ బాంబుతో వ్యక్తి ఆత్మహత్య

కర్ణాటకలోని తుమకూరు హైవేపై సంచలన ఘటన చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన నాగేంద్ర (30) అనే వ్యక్తి ఓ యువతిని కారులోనే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన అనంతరం పెట్రోల్ బాంబు పేల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పేలుడు కారణంగా కారుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. మంటల్లో చిక్కుకున్న నాగేంద్ర సజీవదహనమయ్యాడు. అయితే తీవ్ర గాయాలపాలైన యువతి సమయస్ఫూర్తితో కారు నుంచి బయటకు రావడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన యువతిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత విభేదాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చనే కోణంలో విచారణ కొనసాగుతోంది.