సీఎం విజయ్ బర్త్ డే.. ఉచితంగా బంగారం!
#Tamilnadu #CM vijay #gold rings #vijay birthday
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి సీఎం విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో తూత్తుకుడి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం ఆకర్షణగా నిలిచింది.
సీఎం విజయ్ పుట్టినరోజు రోజునే జన్మించిన ఆరుగురు నవజాత శిశువులకు స్థానిక ఎమ్మెల్యే, తమిళనాడు మత్స్యశాఖ మంత్రి శ్రీనాథ్ బంగారు ఉంగరాలను బహూకరించారు. చిన్నారుల కుటుంబాలను అభినందించిన ఆయన, శిశువుల ఆరోగ్యం, భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మంత్రి అందించిన బంగారు ఉంగరాలు తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించగా, సీఎం విజయ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, విద్యార్థులకు సహాయక చర్యలు కూడా చేపట్టారు.