స్టార్ హీరోయిన్ బయోపిక్ లో సాయి పల్లవి?
సౌత్ ఇండస్ట్రీలో తన నేచురల్ యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ఇప్పటికే సౌత్ ఇండియన్ మూవీస్ తో పాటు నార్త్ లోనూ తన క్రేజ్ ను ఎస్టాబ్లిష్ చేస్తుంది. అమీర్ ఖాన్ కొడుకుతో ఏక్ దిన్ అనే మూవీలో యాక్ట్ చేసింది. రణబీర్ కపూర్ తో రామాయణ మూవీలోనూ నటిస్తుంది. ఇప్పుడు ఆమె గురించి మరో ఆసక్తికర వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కేవలం నటనతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సాయి పల్లవి, భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. రీసెంట్ గా రిలీజ్ అయిన తండేల్ సినిమాతో సాయి పల్లవి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. తాజాగా మరో పెద్ద ప్రాజెక్ట్‌లో సాయి పల్లవి నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారతీయ సినీ చరిత్రలో అత్యంత అందమైన, మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు పొందిన మధుబాల జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మధుబాల పాత్ర కోసం సాయి పల్లవిని సెలెక్ట్ చేసినట్టు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్లాన్ చేస్తున్నారట. ఆయన సినిమాలు అంటే గ్రాండ్ విజువల్స్, బలమైన కథ, గొప్ప నటనకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆయన ఇప్పటికే పద్మావత్, గంగూభాయి కతియావాడి లాంటి భారీ హిట్ ప్రాజెక్ట్స్ ని తెరకెక్కించారు. మధుబాల బయోపిక్ కోసం మొదటగా కియారా అథ్వానీ, అలాగే అనీత్ పడ్డా లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. కానీ మధుబాల పాత్రలో ఉండే గాంభీర్యం, సౌమ్యత, సహజ నటనను బాగా చూపించగలిగేది సాయి పల్లవే అని దర్శకుడు భావిస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంకా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అయినప్పటికీ సాయి పల్లవి వంటి సహజ నటన కలిగిన హీరోయిన్, మధుబాల లాంటి ఐకానిక్ పాత్రలో నటిస్తే సినిమా మరింత ప్రత్యేకంగా ఉంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. కానీ ఒకానొక సందర్భంలో ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే తాను బయోపిక్ లాంటి ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేయను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి ఈ ప్రాజెక్ట్ పై సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.