సల్మాన్ ఖాన్ ట్విస్ట్.. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్ ఛేంజ్

Mar 16, 2026 - 15:38
 0  2
సల్మాన్ ఖాన్ ట్విస్ట్.. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్ ఛేంజ్

బాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ వార్ డ్రామా సినిమా టైటిల్ ఛేంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. గతంలో ఈ సినిమాను బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే టైటిల్ తో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు ఆ టైటిల్‌ను మార్చి మాతృభూమి అని ఫిక్స్ చేశారు. ఈ కొత్త టైటిల్‌ను సల్మాన్ ఖాన్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్టర్‌ తో అనౌన్స్ చేశారు. సల్మాన్ షేర్ చేసిన పోస్టర్‌లో ఆయన చాలా సీరియస్‌గా కనిపిస్తున్నారు. ఒంటిపై గాయాలతో రక్తం కారుతున్నట్టుగా చూపించారు. శత్రువులు ముందుకు రాకుండా ముళ్ల కంచెతో ఉన్న ఒక స్తంభాన్ని గట్టిగా పట్టుకుని నిలబడిన స్టిల్ ఈ పోస్టర్‌లో కనిపిస్తోంది. ఈ పోస్టర్‌తో పాటు లెట్ ద వార్ రెస్ట్ ఇన్ పీస్ అనే సాలిడ్ క్యాప్షన్ కూడా పెట్టారు. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్‌లో రిలీజ్ డేట్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో అభిమానులు కొంత కన్ఫ్యూషన్ లో ఉన్నారు. ఈ సినిమా కథ 2020లో జరిగిన గల్వాన్ వ్యాలీ క్లాష్ నేపథ్యంలో రూపొందుతోంది. లడఖ్‌ లోని గాల్వన్ లోయ వద్ద భారత సైన్యం మరియు చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణలో భారత సైనికులు ఎంతో ధైర్యంగా పోరాడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఆ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను రూపొందిస్తున్నారు.

ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్నారు. దేశం కోసం భారత సైనికులు చేసిన త్యాగాలు, వారి ధైర్యసాహసాలు ఈ సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారు. దేశభక్తి నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ పై గతంలో కొంత వివాదం కూడా వచ్చింది. చైనా ప్రభుత్వానికి చెందిన మీడియా సంస్థ ఈ సినిమాపై విమర్శలు చేసింది. ఈ సినిమాని సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కు జోడిగా చిత్రంగద సింగ్ యాక్ట్ చేస్తున్నారు. మొత్తానికి దేశభక్తి కథతో రూపొందుతున్న ఈ సినిమా పై ఇప్పటి నుంచే మంచి ఆడియన్స్ లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. టైటిల్ ఛేంజ్, రిలీజ్ డేట్ లేకపోవడం వంటి విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.