పుష్ప తొక్కిసలాట కేసు.. కోర్టు విచారణకు అల్లు అర్జున్ గైర్హాజరు?
#allu arjun #Pushpa movie #Telangana #highcourt
పుష్ప సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నేడు హీరో Allu Arjun నాంపల్లి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ముంబైలో ఉన్న నేపథ్యంలో కోర్టు విచారణకు ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును కోరినట్లు సమాచారం.
ఆన్‌లైన్ విచారణకు అనుమతి లభిస్తే అల్లు అర్జున్ వర్చువల్‌గా విచారణలో పాల్గొనే అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు నుంచి అనుమతి రాకపోతే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ అబ్సెంట్ పిటిషన్ దాఖలు చేసేందుకు ఆయన న్యాయ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసు విచారణపై సినీ వర్గాలు, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కోర్టు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం కేసుకు సంబంధించిన తదుపరి పరిణామాలపై అందరి దృష్టి నెలకొంది.