బంజారాహిల్స్‌లో సినీ నటికి వేధింపులు.. కేసు నమోదు

#Telangana #బంజారాహిల్స్ #హీరోయిన్ #Herassment

Jun 15, 2026 - 10:58
 0  4
బంజారాహిల్స్‌లో సినీ నటికి వేధింపులు.. కేసు నమోదు

సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ పరిచయమైన క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌పై ఓ సినీ నటి ఫిర్యాదు చేసింది. ఆకాశంలో ఒక తార సినిమాలో కథానాయిక స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని చెప్పి సంప్రదించాడని తెలిపింది. 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తయినా, ఇవ్వాల్సిన ₹90 వేల పారితోషికంతో పాటు ₹38 వేల ప్రయాణ ఖర్చులు ఇవ్వకుండా కాలయాపన చేశాడని ఆరోపించింది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కార్యాలయం వద్దకు పిలిచి, బకాయి డబ్బులు ఇవ్వకుండా బెదిరించాడని తెలిపింది.

బలవంతంగా కారులో తీసుకెళ్లి మరిన్ని అవకాశాలు ఇస్తానంటూ తన కోరికలు తీర్చాలని అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.