నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం కేసు.. ఇద్దరు నిందితులు అరెస్ట్
#nalgonda #NTRstatue #case #arest #police
నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ గౌడ్‌తో పాటు ఎలుకంటి ప్రణీత్‌ను అదుపులోకి తీసుకుని పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 6వ తేదీ తెల్లవారుజామున నల్గొండలోని ఎన్టీఆర్ విగ్రహానికి బెడ్ షీట్లు కప్పి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఘటన అనంతరం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు, నిందితులు TS 07 HT 2430 నంబర్ గల బలెనో కారులో వచ్చి ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించారు.
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడినందున పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.