నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం

#padmaawards #రాష్ట్రపతి #అవార్డ్స్ #నేషనల్

Jun 23, 2026 - 13:39
 0  1
నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం

దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం నేడు ఢిల్లీలో ఘనంగా జరగనుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 65 పురస్కారాలు అందజేయనున్నారు.

కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, సామాజిక సేవ, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు ఈ అవార్డులను అందుకోనున్నారు. కాగా, ఈ ఏడాది జనవరి 25న కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో కొంతమందికి ఇప్పటికే అవార్డులు ప్రదానం చేయగా, మిగిలిన వారికి నేడు నిర్వహించే కార్యక్రమంలో పురస్కారాలు అందజేయనున్నారు. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.