విజయ్‌కు విశాల్ వినూత్న కానుక
#visal #vijay #Tamilnadu #Education #Hero
పూల బొకేలు, శాలువాలు వంటి సాంప్రదాయ కానుకల కంటే విద్యాదానం ఎంతో గొప్పదని నటుడు విశాల్ మరోసారి చాటిచెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గౌరవార్థం ఆర్థికంగా వెనుకబడిన ముగ్గురు విద్యార్థినుల ఉన్నత విద్యకు పూర్తి స్పాన్సర్షిప్ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా “ఒక బొకే కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది.. కానీ ఒక చిన్నారి విద్య జీవితాంతం వెలుగునిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
సమాజానికి ఉపయోగపడే విధంగా గౌరవాన్ని తెలియజేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విషాల్ వెల్లడించారు. విద్యార్థినుల భవిష్యత్తుకు అండగా నిలవడం ద్వారా నిజమైన సేవ చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
విశాల్ నిర్ణయాన్ని అభిమానులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు ప్రశంసిస్తున్నారు. విద్య ద్వారా జీవితాలను మార్చే అవకాశం ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తినిస్తాయని పేర్కొంటున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా విషాల్ సామాజిక బాధ్యతను అభినందిస్తున్నారు. ఈ చర్య విద్య ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.