ఇండియాలో టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం

#india #telegram #కేంద్రప్రభుత్వం #Neetexam

Jun 16, 2026 - 14:28
 0  2
ఇండియాలో టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం

నీట్ (NEET-UG) 2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది. జూన్ 21న జరగనున్న రీ-ఎగ్జామ్‌లో ప్రశ్నాపత్రాల లీక్‌లు, తప్పుడు ప్రచారం, చీటింగ్ నెట్‌వర్క్‌ల కార్యకలాపాలను అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జాతీయ పరీక్షల సంస్థ (NTA) సిఫారసుల మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఈ ఆదేశాలు జారీ చేసింది. టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా జూన్ 30 వరకు నిలిపివేయాలని సూచించినట్లు సమాచారం.

గతంలో ప్రశ్నాపత్రాల లీక్‌లకు సంబంధించిన తప్పుడు సమాచారం, మోసపూరిత కార్యకలాపాలు టెలిగ్రామ్ ద్వారా వ్యాపించినట్లు దర్యాప్తులో గుర్తించారు. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు, విద్యార్థుల ప్రయోజనాలను రక్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, పరీక్షల సమగ్రత కోసం ఇది అవసరమని ఎన్టీఏ పేర్కొంది.