హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
#Telangana #Hyderabad #food safety #restaurant
హైదరాబాద్‌లోని మియాపూర్ మదీనాగూడలో ఉన్న అంతేరా రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫంగస్ పట్టిన కాలీఫ్లవర్, ఇతర కూరగాయలు, వంటకు పనికిరాని నూనె, లేబుల్స్ లేకుండా నిల్వ చేసిన ఆహార పదార్థాలను గుర్తించారు. దీంతో రెస్టారెంట్ యాజమాన్యానికి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.
అలాగే హైటెక్ సిటీలోని జూబ్లీ ఎంక్లేవ్‌లో ఉన్న లా పినోజ్ పిజ్జా రెస్టారెంట్‌లో నిర్వహించిన తనిఖీల్లో ఫ్రిజ్‌లో పురుగులు, కిచెన్‌లో బొద్దింకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెజ్, నాన్‌వెజ్ పదార్థాలను ఒకే చోట నిల్వ చేయడం, ఆహార పదార్థాలు ఉంచే ప్రాంతాల్లో బల్లి విసర్జనలు కనిపించడం వంటి పరిశుభ్రత లోపాలు బయటపడ్డాయి. ఈ ఉల్లంఘనలపై కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేసి, ఆహార భద్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.