ఇది ఎవ‌రి గేమ్..?

#pawankalyan #ఆంధ్రప్రదేశ్ #తెలంగాణ #politics #కేటీఆర్ #నాగేశ్వరరావు

Jun 4, 2026 - 12:16
 0  7
ఇది ఎవ‌రి గేమ్..?

నాగేశ్వ‌ర్ అలా చెప్ప‌డం ఏంటి..? దానికి ప‌వ‌న్ రియాక్ట్ కాగానే.. తెలంగాణ వాదులమంటూ కొంద‌రు ఎంట‌రై... ర‌చ్చ చేయ‌డ‌మేంటి? ప‌వ‌న్ జూన్ 2న న‌వ‌నిర్మాణ సంక‌ల్ప స‌భ అని అనౌన్స్ చేయ‌డ‌మేంటి...? దానిని అడ్డుకుంటామ‌ని చెప్ప‌డం.. ప్ర‌భుత్వ‌మేమో ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డం... ఆ త‌ర్వాత ప‌వ‌న్ వ‌చ్చి తెలంగాణ‌లో జ‌న‌సేన పోటీ చేస్తుంది..తానే తిరుగుతాన‌ని చెప్ప‌డం.. అంతా విచిత్రంగా జ‌రిపోయాయి.. అస‌లు తెర వెన‌క ఏం జ‌రిగింది? ఎవ‌రు ప్లాన్ చేశారు ఇదంతా? ఒక‌వైపు తెలంగాణ వాదులమ‌ని చెప్పుకునేవారు సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ అయ్య జాగీరు వ్యాఖ్య‌ల‌పై ఫైర్ అవుతున్నారు. మ‌రోవైపు జ‌న‌సేన‌వాళ్లు వాటికి కౌంట‌ర్ ఇస్తున్నారు. ముందు మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ప‌వ‌న్ కు మ‌ద్ద‌తు తెలిపారు.. కాని త‌ర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప‌వ‌న్ పై విరుచుకుప‌డ్డారు. సో బీఆర్ఎస్ ఎగైనెస్ట్ ప‌వ‌న్. ఇక ముందు వార్నింగులు ఇచ్చిన క‌విత ఇప్పుడు ఏం మాట్లాడ‌లేదు. మ‌రోవైపు విచిత్రంగా కాంగ్రెస్ నేత‌ల‌తా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ప్రెస్ మీట్లు పెట్టి మ‌రీ ప‌వ‌న్ పై విమ‌ర్శ‌ల‌తో మండిప‌డుతున్నారు. ప‌వ‌న్ మాత్రం త‌న ల‌క్ష్యం ఫిక్స్ అన్న‌ట్లే ట్వీట్ పెట్టేశారు.

ఇక్క‌డ విష‌యం ఏంటంటే తెలంగాణ‌లో యాక్టివ్ అవ్వాల‌నే ప‌వ‌న్ వ్యూహం ముందే ఫిక్స్. రామ్ తాళ్లూరి విజ‌య‌వాడ వ‌చ్చిన‌ప్పుడే ఆ విష‌యం ప్ర‌క‌టించారు కూడా. అయితే టైమ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ టైమ్ ని నాగేశ్వ‌ర్, తెలంగాణ వాదుల ద్వారా ముందుకు తెచ్చింది వైసీపీ. ఆ త‌ర్వాత దానిని అందుకుని ముందుకు తోసింది రేవంత్ రె్డ్డి టీమ్. ఎస్.. వీరంద‌రూ క‌లిసి తెలంగాణలో యాక్టివ్ అవ్వాల‌నుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యూహాన్ని అమ‌లుకు కావాల్సిన టైమింగ్ క్రియేట్ చేశారు. చూడ‌టానికి మాత్రం వీరంతా డిస్ట్ర‌బ్ చేసినందుకే ప‌వ‌న్ వ‌చ్చిన‌ట్లు.. ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు క‌న‌పడుతోంది. కాని నాగేశ్వ‌ర్ తో స‌హా వారంతా కాగ‌ల కార్యాన్ని చేసిపెట్టిన గాంధ‌ర్వులే. 

ఎటొచ్చీ కాంగ్రెస్ ఎందుకు ఇంత కంగారుప‌డుతుంది? ఎందుకంటే దీని వెన‌క ఉన్న మాస్ట‌ర్ బ్రెయిన్ బిజెపియే. అందుకే. బిజెపి అంటే కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ లేక రామ‌చంద్ర‌రావులు కాదు. అమిత్ షా యే. అవును వారు చెప్ప‌కుండా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇంత ప్లాన్ సొంతంగా చేసే ప‌రిస్ధితి అయితే లేదు. పైగా బిజెపి జీహెచ్ఎంసీలో ఒంట‌రిగా పోటీ చేస్తానంది క‌దా అంటే ఓకె.. జ‌న‌సేన కూడా ఒంట‌రిగాఆ పోటీ చేస్తుంద‌ని చాలా కూల్ గా రిప్ల‌య్ ఇచ్చాడు ప‌వ‌న్ క‌ల్యాణ్. అంటే ఏం జ‌ర‌గ‌బోతుంది ప‌వ‌న్ కు తెలుస‌న్న‌మాట‌. బిజెపి ఈ ప్లాన్ వేసింద‌ని తెలిసినందుకే రేవంత్ టీమ్ పూర్తిగా ఇన్ వాల్వ్ అయిపోయింది. వార్ కాంగ్రెస్ వ‌ర్సెస్ ప‌వ‌న్ అన్న‌ట్లు అయిపోయింది. ఇదే రేపు కాంగ్రెస్ వ‌ర్సెస్ ఎన్డీయే గా మార‌బోతుంది. అప్పుడు బీఆర్ఎస్ ఆట‌లో అరటిపండు అయిపోతుంది. ఆ విష‌యం కాస్త లేటుగా తెలుసుకుంది బీఆర్ఎస్. 

అయితే ఈ గేమ్ ప్లాన్ లోకి టీడీపీ నేరుగా ఎంట‌ర‌వుతుందా.. లేక ప‌రోక్షంగా ఉంటుందా అనే తేలాల్సి ఉంది. టీడీపీ ఓటు బ్యాంకు ఇంకా హైద‌రాబాద్, ఖ‌మ్మం లాంటి చోట్ల బ‌లంగానే ఉంది. అది బిజెపికి తోడు అయితే లాభ‌మే. అయితే చంద్ర‌బాబుపై ఇప్పటికీ తెలంగాణ ప్ర‌జ‌ల్లో చాలామందిలో వ్య‌తిరేక‌త ఉంది. 2018లో చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారానికి రావ‌టంతోనే కేసీఆర్ కు పాలు పోసిన‌ట్ల‌యింది. అందుకే 2023 ఎన్నిక‌ల్లో . చంద్ర‌బాబు నేరుగా జోక్యం చేసుకోలేదు. రేవంత్ రెడ్డి త‌న మనిషే అయినా.. రేవంత్ రెడ్డికి సొంత ప్లాన్లు ఉంటాయి. ఇప్ప‌టికి ఎన్డీయేలో బిజెపితో పాటు జ‌న‌సేన వ‌చ్చింది.. టీడీపీ వ‌స్తుందా రాదా చూడాలి.

బిజెపి లీడ‌ర్లు ఎవ‌రూ కూడా తెలంగాణ‌లో స‌క్సెస్ తేలేర‌నే నిశ్చితాభిప్రాయానికి బిజెపి వ‌చ్చేసింది. అందుకే ఈ ప్లాన్ లోకి వ‌చ్చింది. రేపు రేవంత్ రెడ్డి సైతం క‌మ‌లం నీడ‌లోకి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. కాక‌పోతే ఈ ఎపిసోడ్ మొత్తం ప‌వ‌న్ క‌ల్యాణ్ కు తెలంగాణ‌లో ఏమో గాని.. ఆంధ్రాలో బ‌లం పెర‌గ‌డానికి అయితే ఉప‌యోగ‌ప‌డుతుంది.. నో డౌట్.