సాయికృష్ణ మిస్సింగ్ కేసు విచారణకు రాజమండ్రి ఎస్పీ నియామకం
#Andhrapradesh #vijayawada #Rajamundry #Saikrishna #missing
విజయవాడకు చెందిన రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ అధికారిగా రాజమండ్రి ఎస్పీ Narasimha Kishoreను నియమించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ లాకప్ డెత్ జరిగిందనే ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది.
నేడు రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ను సందర్శించి కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించనున్నారు. మరోవైపు, తన కుమారుడు సాయికృష్ణ బతికి ఉన్నాడో లేదో స్పష్టత ఇవ్వాలని తల్లి విజయలక్ష్మి అధికారులను కోరుతున్నారు.
సాయికృష్ణ అదృశ్యంపై పూర్తి స్థాయి నిజానిజాలు వెలికితీయాలని, కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయంగానూ చర్చ జరుగుతుండగా, విచారణ ఫలితాలపై ఆసక్తి నెలకొంది.