చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు.. యువసేన భారీ బైక్ ర్యాలీ

#చంద్రబాబు నాయుడు #ఏపీసీఎం #ఆంధ్రప్రదేశ్ #బైక్ ర్యాలీ

Apr 21, 2026 - 10:55
 0  6
చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు.. యువసేన భారీ బైక్ ర్యాలీ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని టిడిపి సీనియర్ నేత ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, చంద్రబాబు యువసేన జాతీయ అధ్యక్షుడు చెన్నోజు రఘుబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో లోకేష్ ముఖ్యమంత్రి కావాలన్నదే తమ కోరికని వెల్లడించారు.

చంద్రబాబు యువసేన ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని యువసేన ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ పాదయాత్ర నిర్వహించారు కనకదుర్గమ్మ వారధి నుండి టిడిపి కేంద్ర కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీకి యువసేన జాతీయ అధ్యక్షుడు చెన్నోజు రఘుబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఓ బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర కారదర్శి తులసిపాటి కృష్ణంరాజు, ఇంకా బలరాం, వైకుంఠం తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు యువసేన తరఫున ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా కనకదుర్గమ్మ వారధి నుంచి టిడిపి కేంద్ర కమిటీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. అనంతరం వందలాది మందికి అన్నదానం నిర్వహించామన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని తెలిపారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని వారు ఆకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో యువ నేత లోకేష్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని వారు ఆకాంక్షించారు. కార్యకర్తల కోలాహలం డీజే వాయిద్యాల నడుమ బైక్ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది.

ఈ కార్యక్రమంలో బలరామకృష్ణ పోలవరం కాన్స్టెన్సీ సీనియర్ స టిడిపి నాయకులు, ఎలకల వైకుంఠరావు ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.