జొన్నగిరి ‘బంగారు గని'.. రేపే ప్రారంభం
#andhrapradesh #jonnagiri gold mine #inauguration #chandrababunaidu #karnool
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ఉత్పత్తికి కీలక అడుగు పడుతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. ఇదే సందర్భంగా రెండో యూనిట్‌కు శంకుస్థాపన కూడా చేయనున్నారు.
సుమారు రూ.320 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునివ్వనుంది. మొత్తం 1,477 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. భూమి అడుగున సుమారు 2 కిలోమీటర్ల లోతు వరకు బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా వెయ్యి కిలోల బంగారం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభంతో రాష్ట్రంలో ఖనిజ సంపద వినియోగానికి కొత్త దారులు తెరుచుకోనున్నాయని అధికారులు భావిస్తున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి.