కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ మాయం.. సిట్ అనుమానాలు

#andhrapradesh #విజయవాడ #కృష్ణలంక #సాయి కృష్ణ #police station #CC tv footage

Jun 23, 2026 - 13:35
 0  1
కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ మాయం.. సిట్ అనుమానాలు

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. ముఖ్యంగా మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న దృశ్యాలు అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

సిట్ విచారణలో భాగంగా, అప్పటి సీఐ నాగరాజు కేవలం రెండు రోజుల ఫుటేజ్ మాత్రమే భద్రపరిచినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇటీవల కోర్టు నెల రోజుల సీసీటీవీ దృశ్యాలను భద్రపరచాలని ఆదేశించిన నేపథ్యంలో, అంతకుముందే కీలక ఫుటేజ్ తొలగించబడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఫుటేజ్ మాయం చేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సిట్ అధికారులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఫుటేజ్ మాయానికి బాధ్యులెవరు, దాని వెనుక ఉన్న కారణాలేమిటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.