నేడు జరగనున్న AITUC నగర 15 వ మహాసభను జయప్రదం చేయండి

Apr 19, 2026 - 10:12
Apr 19, 2026 - 10:19
 0  4
నేడు జరగనున్న AITUC నగర 15 వ మహాసభను జయప్రదం చేయండి

మున్సిపల్ కార్మికులకు యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా పిలుపు

     కార్మిక హక్కుల శ్రేయస్సుకై నిరంతరం ఉద్యమిస్తున్న AITUC నగర 15 వ మహాసభను జయప్రదం చేయాలని విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్  ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా పిలుపునిచ్చారు. శనివారం ఉదయం భవానిపురం 40 వ డివిజన్ సానిటరీ కార్యాలయం వద్ద కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఏ కష్ట ముందుండి పోరాడే సంఘం ఏఐటియుసి అని అన్నారు. కష్టజీవులకి ఐ టి ఏఐటియుసి కొండంత అండ అని కొని ఆడారు.

కార్మికుల కష్టాన్ని దోచుకుంటే ఏఐటియుసి చూస్తూ ఊరుకోదని అన్నారు. సుదీర్ఘ పోరాటాల చరిత్ర మరి సంఘానికి లేదని అన్నారు. 36వ డివిజన్ శానిటరీ కార్యాలయం వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో అధ్యక్షులు ఎస్వీఎస్ చలం, సహాయ కార్యదర్శి తుపాకుల ప్రతాప్ మాట్లాడి ప్రసంగి చారు.  48వ సానిటరీ కార్యాలయం వద్ద జరిగిన కార్నర్ మీటింగులో యూనియన్ గౌరవాధ్యక్షులు జక్కీ జేమ్స్, కోశాధికారి తుపాకుల నాగేశ్వరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.