జాహ్నవి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు.. కుక్కకు పోస్టుమార్టం పూర్తి

#Andhrapradesh #జాహ్నవి #missing case

Jun 15, 2026 - 11:09
 0  4
జాహ్నవి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు.. కుక్కకు పోస్టుమార్టం పూర్తి

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారం సమీపంలో తొమ్మిది రోజుల క్రితం అడవిలోకి వెళ్లి అదృశ్యమైన చిన్నారి జాను కోసం గాలింపు చర్యలు మరింత వేగవంతమయ్యాయి. జానుతో కలిసి వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం మృతి చెందిన కుక్కకు పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు, దాని శరీరం నుంచి నమూనాలను సేకరించి విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మరో 30 మంది ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు ఇతర అధికారులు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. అలాగే ఘటనాస్థలం పరిసరాల్లోని 7 మొబైల్ టవర్ల పరిధిలో నమోదైన 4,800 ఫోన్ కాల్స్‌ను విశ్లేషించి, కొందరు అనుమానితులను గుర్తించినట్లు సమాచారం. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.