వైసీపీ మహిళా నేత ఆత్మహత్యాయత్నం

#Andhrapradesh #YCP #Ongole #politics

Jul 11, 2026 - 15:04
 0  3
వైసీపీ మహిళా నేత ఆత్మహత్యాయత్నం

ఒంగోలులో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఈ నెల 8న జరిగిన వైఎస్ జయంతి కార్యక్రమంలో పార్టీ కార్యాలయంలోనే కొందరు వైసీపీ నేతలు తనపై దాడి చేశారని ప్రసన్న ఆరోపించారు. కాళ్లు తొక్కారంటూ ప్రశ్నించినందుకే తనను విచక్షణారహితంగా కొట్టారని ఆమె పేర్కొన్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో తన తల్లిపై దాడి చేశారంటూ వైసీపీ నేత శివకుమార్‌పై ప్రసన్న కుమారుడు దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనల తర్వాత ఒంగోలు వైసీపీ ఇన్‌చార్జ్ ఆమెను పార్టీ గ్రూపుల నుంచి తొలగించారు. తనకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రసన్న సెల్ఫీ వీడియో విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.