తుని రైల్వే స్టేషన్ వద్ద తృటిలో తప్పిన విషాదం
#ఆంధ్రప్రదేశ్ #తుని #రైల్వేట్రాక్
కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్యకు యత్నించగా, రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి అతని ప్రాణాలను కాపాడారు. ట్రాక్‌పై యువకుడు పడుకున్న విషయాన్ని అవుట్‌పోస్ట్ రైల్వే సిబ్బంది గుర్తించి వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. అదే సమయంలో ట్రాక్‌పై రైలు వస్తుండటంతో లోకో పైలట్‌ను అప్రమత్తం చేయగా, ఆయన వెంటనే రైలు వేగాన్ని తగ్గించారు. మరోవైపు స్థానికులు ట్రాక్‌పై ఉన్న యువకుడికి రాళ్లు విసురుతూ, గట్టిగా కేకలు వేయడంతో అతడు అప్రమత్తమై ట్రాక్‌పై నుంచి పక్కకు తప్పుకున్నాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. యువకుడిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు అతడి వివరాలు సేకరిస్తూ, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.