ఘనంగా ప్రారంభమైన "స్వగ్రామం రెస్టారెంట్"
#vijayawada #andhrapradesh #Mogalrajpuram #resturant opening #vangalapudi anitha
విజయవాడ నగరంలోని మొగలరాజ్‌పురం, ఆర్.ఆర్. జాయింట్స్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన "స్వగ్రామం రెస్టారెంట్" శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, రాజధాని ప్రాంతంలో హోటల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్వగ్రామం రెస్టారెంట్ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుందని, ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ రుచులను అందించే ఈ రెస్టారెంట్‌కు నగర ప్రజల నుంచి మంచి ఆదరణ లభించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటలియర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వీ స్వామి, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే తనయుడు గద్దె క్రాంతి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే తనయుడు బొండా సిద్ధార్థ, స్వగ్రామం రెస్టారెంట్ అధినేత రమణ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
సాంప్రదాయ గ్రామీణ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై నిర్వాహకులను అభినందించారు.