మల్లారెడ్డి విశ్వవిద్యాపీట్ ఆధ్వర్యంలో “వన్ హెల్త్ అంబులెన్స్” సేవల ప్రారంభం
ఆలస్యం అంటే ప్రమాదం…క్షణాల్లో స్పందించే వన్ హెల్త్ అంబులెన్స్!
ప్రాణాలను కాపాడే వేగం…5G టెక్నాలజీతో వన్ హెల్త్ అంబులెన్స్ ఎంట్రీ!
సూరారం లోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీట్ ఆధ్వర్యంలో “వన్ హెల్త్ అంబులెన్స్” సేవలను మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ సి.హెచ్. మల్లారెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ అంబులెన్స్‌లు ప్రమాద సమయంలో వేగంగా స్పందించి, రోగులు ఆసుపత్రికి చేరకముందే ప్రాథమిక అత్యవసర చికిత్స అందించడమే లక్ష్యంగా పనిచేస్తాయని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ప్రతి 37 వేల మందికి ఒక అంబులెన్స్ మాత్రమే అందుబాటులో ఉండగా, కొన్ని ప్రాంతాల్లో అంబులెన్స్ రావడానికి 40 నుంచి 50 నిమిషాలు సమయం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా “వన్ హెల్త్ అంబులెన్స్” సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అంబులెన్స్‌లలో BLS మరియు ALS సదుపాయాలు ఉండగా, 5G సాంకేతికతతో లైవ్ పేషెంట్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదనంగా త్వరలో మొబైల్ యాప్ ద్వారా SOS బుకింగ్ మరియు లైవ్ ట్రాకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సేవల కోసం ప్రత్యేక అత్యవసర నంబర్ 9734 108 108 ను విడుదల చేశారు. మల్కాజ్‌గిరి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, బాచుపల్లి, మణికొండ, షామీర్‌పేట, KPHB, సికింద్రాబాద్, ECIL, మియాపూర్, పంజాగుట్ట వంటి ప్రధాన ప్రాంతాల్లో ఈ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత, మేడ్చల్ ఎమ్మెల్యే సిహెచ్. మల్లారెడ్డి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మొదటి కొన్ని నిమిషాలే ప్రాణాలను కాపాడటంలో కీలకమని అన్నారు. శిక్షణ పొందిన బృందాలు మరియు ఆధునిక సాంకేతిక వ్యవస్థలతో ప్రజలకు తక్షణ సేవలు అందించేందుకు ఈ అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ & చైర్మన్ సి.హెచ్. మల్లారెడ్డి, డాక్టర్. భద్ర రెడ్డి మల్లారెడ్డి విద్యాపీట్ చైర్మన్,మల్లారెడ్డి విశ్వవిద్యాపీట్ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి రెడ్డి, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.