ఏపీ ప్రజలకు హై అలర్ట్..!

Mar 31, 2026 - 10:45
 0  5
ఏపీ ప్రజలకు హై అలర్ట్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వాతావరణం భిన్నంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, అల్లూరి, పాలనాడు, కర్నూలు, నంద్యాల, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ (APSDMA) వెల్లడించింది.

మన్యం, పల్నాడు, విజయనగరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వడగాలులు, పిడుగుల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని అధికారులు సూచించారు. రైతులు, గిరిజనులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.