తుని చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్
#Andhrapradesh #kakinada #Thuni #missing
కాకినాడ జిల్లా తుని మండలంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారిని అడవి జంతువులు లాక్కెళ్లి ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా సీసీటీవీ ఫుటేజ్‌లను సమగ్రంగా పరిశీలించినట్లు ఎస్పీ తెలిపారు. అయితే చిన్నారిని ఎవరైనా వ్యక్తులు తీసుకెళ్లినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని స్పష్టం చేశారు. అడవి జంతువుల ప్రమేయం ఉండవచ్చనే అనుమానం ఉన్నప్పటికీ, ఆ అంశాన్ని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదన్నారు.
చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు, ప్రత్యేక బృందాలు, అటవీ శాఖ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కేసును అత్యంత ప్రాధాన్యంతో విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.