విజయవాడలో సందడి చేసిన హీరోయిన్లు
#vijayawada #payalrajputh #shivaninagaram #shoppingmall
పాయల్ రాజ్‌పుత్, శివాని నాగారం విజయవాడ నగరంలో సందడి చేశారు. విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో చైతన్య స్కూల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది మార్క్స్ స్టూడియో’ను వారు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు బోండా రవితేజ, స్టూడియో యజమానులు వంశీ, రవికిరణ్ పాల్గొన్నారు.
స్టూడియో ప్రారంభించిన అనంతరం అందులో అందిస్తున్న సేవల వివరాలను హీరోయిన్లు నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాయల్ రాజ్‌పుత్, శివాని నాగారం మాట్లాడుతూ విజయవాడ నగరం తమకు ఎంతో ఇష్టమని తెలిపారు. నగరానికి వచ్చిన ప్రతిసారి కనకదుర్గమ్మ ఆలయంను దర్శించుకోవడం తమకు ఆనవాయితీగా మారిందన్నారు.
తాము హెయిర్ స్టైలింగ్, మేకప్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, అయితే మేకప్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆధునిక కాలంలో యువత హెయిర్, స్కిన్ కేర్, మేకప్ సేవలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, అలాంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల సేవలను ఒకే చోట అందించేలా స్టూడియో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని స్టూడియోలు ప్రారంభించాలని ఆకాంక్షించారు.
స్టూడియో నిర్వాహకులు వంశీ, రవికిరణ్ మాట్లాడుతూ సత్యనారాయణపురం, భానునగర్, మధురానగర్, బీఆర్‌టీఎస్ రోడ్ పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ స్టూడియోను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హెయిర్, స్కిన్, మేకప్, మెయిల్ గ్రూమింగ్ తదితర సేవలను ఒకే చోట అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని బ్రాంచ్‌లు ప్రారంభించి సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.