దారుణం.. పోక్సో కేసు కక్షతో ఆరుగురి హత్య

#Telangana #pocso case #రంగారెడ్డి జిల్లా #shabad #Crime

Jul 11, 2026 - 14:06
 0  3
దారుణం.. పోక్సో కేసు కక్షతో ఆరుగురి హత్య

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోక్సో కేసు నమోదు చేయించారన్న కక్షతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మే 16న తనపై పోక్సో కేసు నమోదైన అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు, కేసుకు సంబంధం ఉన్న బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలను కూడా హతమార్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. హత్యల అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరుగురిని చంపినట్లు చెప్పడంతో పాటు తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని తెలిపినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న సీపీ తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.