మావిగన్, ఇది ఒక దారి తెన్నూ లేని పిచ్చి వ్యూహం
#mavigun #jagan mohan reddy #Andhrapradesh
’’అక్కడ అమెరికాలో ఉండి ఒకడు పిచ్చిపిచ్చిగా చేస్తూ ప్రపంచాన్నే ఇబ్బంది పెడుతున్నాడు.. ఇక మన రాష్ట్రంలో ఉన్న మరొకడు ఇలాంటి పిచ్చి వ్యూహాలతో ఏపీ భవిష్యత్‌నే నాశనం చేయాలని చూస్తున్నాడు. అక్కడ వాడు ఫెయిల్ అయ్యాడు.. ఇక్కడ కూడా ఫెయిలే’’ ఇది ఒక మేధావి మాట.
కేవలం కూటమి బలపడకూడదని... కూటమి వ్యూహం సక్సెస్ కాకూడదని ఒక పిచ్చి వ్యూహంతో వైసీపీ ముందుకొచ్చిందనే కామెంట్లు వస్తున్నాయి. మావిగన్ అనే పేరు జగన్ చెప్పినప్పుడు అందరూ నవ్వుకున్నారు. ముందు షాక్ అయినా తర్వాత తేరుకుని జోకులు వేసుకున్నారు. కాని ఆ పేరు మళ్లీ మళ్లీ వినపడుతుందని.. దానినే వైసీపీ నేతలు జపం చేస్తారని ఎవరూ ఊహించలేదు. అది ఆ రోజుతో ఎండ్ అవుతుందనుకున్నారు. కాని కావాలనే ఒక వ్యూహం ప్రకారం దానిని తెరపైకి తెచ్చిన వైసీపీ ఎవరెంత నవ్వుకున్నా తన వ్యూహాన్ని కొనసాగిస్తూనే ఉంది. తన లాజిక్స్, రీజన్స్ వినిపిస్తూనే ఉంది.
అమరావతి ఫిక్స్ అయిపోయింది. గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. మెదడు ఉన్నవాడెవడు దానిని మార్చేయొచ్చని.. మార్చగలడని అనుకోడు. కేవలం అమరావతి సక్సెస్ కాకూడదు.. అది తెచ్చిన చంద్రబాబు సక్సెస్ కాకూడదు.. అదే జరిగితే తనకు నో స్కోప్ అనే ఆలోచన ఉన్నవారే అనుకుంటారు మార్చేయగలమని. ఎందుకంటే అమరావతి వచ్చేసింది ఇక ఎవరూ మార్చలేరు అనే వాతావరణం వచ్చాక.. ఇప్పటివరకు అనుమానాల్లో ఉన్న ఇన్వెస్టర్లు ముందుకు అడుగు వేస్తారు. అది జరిగితే కూటమి సక్సెస్ అవుతుంది. మళ్లీ వారికే ఎన్నికల్లో విజయం వచ్చే అవకాశం ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదు.. అందుకే అమరావతే ఉంటుందని గ్యారంటీ లేదు.. ఇదిగో నేనొస్తే ఇలా చేస్తా అని సింబాలిక్.గా చెప్పేసి ప్రచారం మొదలెట్టాడు జగన్మోహన్ రెడ్డి.
ఇక ఇష్టమున్నా లేకపోయినా దానిని నెత్తికెక్కించుకుని సీనియర్ నేతలు సైతం రోడ్డెక్కి దాని గురించే మాట్లాడుతున్నారు. మనసులో మాత్రం ఏడుస్తున్నారు. అసలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్పారు జగన్.. కాని ఆ మూడు ప్రాంతాల నేతలు మాత్రం దాని గురించి మాట్లాడటం లేదు. ఇక్కడే అర్ధమవుతుంది పరిస్ధితి ఏంటనేది. కాని జగన్ యాటిట్యూడ్ అందరికీ తెలిసిందే.. తాననుకున్నది చేయాల్సిందే.. అందుకే బలవంతంగా కొందరు లీడర్లతో దాని మీద క్యాంపెయిన్ చేయిస్తూనే ఉన్నాడు.
అమరావతి పేరు ఎత్తడానికే ఇప్పటికీ జగన్ ఇష్టపడరనే సంగతి అందరికీ తెలిసిందే. అది ఒక స్కామ్ అని అధికారంలోకి రాగానే అన్నారు. ఆ తర్వాత దానిని నిర్వీర్యం చేయటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. మూడు రాజధానులనే పేరుతో మొత్తం యాక్టివిటీ ఆపేశారు. అమరావతి ఇక అయిపోయింది అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు. ఆ అప్రోచ్ వల్ల వ్యతిరేకత కొనితెచ్చుకుని ఓటమి పాలయ్యాడు. కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ అమరావతి రీస్టార్ట్ అయింది. అయితే మళ్లీ జగన్ వస్తే ఏంటనే ప్రశ్న చాలామందిలో వచ్చింది. అందుకే ఇన్వెస్టర్లు సైతం ముందు వెనకా ఆలోచించిన పరిస్ధితి కనపడింది. ఇవన్నీ గమనించాకే అమరావతిని ఎంత త్వరగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అధికారికం చేస్తే అంత మంచిదని భావించిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా పావులు కదిపి.. సక్సెస్ అయింది. ఆ సక్సెస్‌ని ఫెయిల్ చేయటానికే జగన్ ఈ స్ట్రాటజీని తెర మీదకు తెచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రజల్లో అమరావతి ఇంకా రాలేదు... అమరావతి ఉంటుందని గ్యారంటీ లేదు అనే ఫీలింగ్స్ తేవడానికి శతవిధాల విఫలయత్నం చేస్తున్నాడు. కాని ప్రజలు మాత్రం దానిని కామెడీగానే చూస్తున్నారు. కాని కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం.. తమ రాజకీయ వ్యూహం కోసం కొల్లేటరల్ డ్యామేజీ కింద రాష్ట్రాన్నే పెడతాడని ఎవరూ ఊహించరు కదా. అధికారంలోకి రావడం కోసం లీడర్లు దేనికైనా సిద్ధపడతారనటానికి ఇది ఒక ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.