దుర్గగుడి వర్సెస్ విఎంసి

#దుర్గగుడి #VMC #విజయవాడ #కనకదుర్గగుడి #భవానీదీక్ష #బిల్లులవివాదం #శీనానాయక్ #వీఎంసీ #ఆంధ్రప్రదేశ్ #TempleNews

May 9, 2026 - 07:49
May 9, 2026 - 09:58
 0  87
దుర్గగుడి వర్సెస్ విఎంసి

కనకదుర్గ గుడికి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కి మధ్య నెలకొన్న బిల్లుల రగడ తారా స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకూ వియంసి బిల్లులకు విడుదల చేయాల్సిన ఫండ్స్‌ ను దుర్గగుడి ఈవో శీనానాయకే విడుదల చేయటం లేదన్న ఆరోపణలకు చెక్‌ పడింది. ఎటువంటి నోట్ ఫైల్‌ లేదా లెటర్‌ గానీ లేకుండా విఎంసి కమీషనర్ స్వంతం నిర్ణయం తీసుకుని భవానీదీక్షల సమయంలో పాలు, బిస్కెట్లను పంచారని దుర్గగుడి వర్గాలు అంటున్నాయి. విషయం ఏంటంటే.. గతేడాది భవానీ దీక్షల సమయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదని హోంమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు అప్పటికప్పుడు ఎటువంటి నోట్‌ఫైల్ ను ఇవ్వకుండా వియంసి కొందరు వెండర్స్‌ ద్వారా అందించిన పాలు, బిస్కెట్లకు ఖర్చు అయిన బిల్లులను నేరుగా దుర్గగుడికి పంపించేశారు. అయితే తాము పంపించిన బిల్లులకు ఫండ్స్‌ రిలీజ్‌ కాకపోవటం లేదన్న విషయం తెలుసుకున్న వియంసి కమీషనర్‌ గత నెల 29న ఓ లెటర్‌ ను దుర్గగుడి ఈవోకు రాశారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. దుర్గగుడికి ఈవో కేవలం ఓ పర్యవేక్షకుడు మాత్రమేనని, దుర్గగుడికి సంబంధించి ఏ బిల్లు పాస్‌ చేయాలన్నా... అందుకు తగ్గట్టుగా ఓ లెటర్‌ ను లేదా కొటేషన్‌ ను ఇస్తేనే ఆ బిల్లులు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంత బిల్లు విడుదల చేసినా.. అందుకు ట్రస్ట్‌ బోర్డు అనుమతితోనే దుర్గగుడి నుంచీ బిల్లులు విడుదల అవుతాయి. అయితే.. విఎంసి కమీషనర్‌ ఏప్రిల్ 29న ఇచ్చిన లెటర్‌ ను గతేడాది భవానీ దీక్షల సమయంలోనే ఇచ్చి ఉంటే బిల్లులు పాస్‌ అయ్యేవని ప్రస్తుతం తెలుస్తోంది. కానీ అప్పుడు ఎటువంటి లెటర్‌ ను విఎంసి కమీషనర్‌ ఇవ్వకపోవటంతో ఆ బిల్లుల విడుదలలో జాప్యం జరిగిందని తెలుస్తోంది. నోట్ ఫైల్‌ అప్రూవల్ తీసుకుని చేయాల్సిన పనిని అవేమీ పాటించకుండా కమీషనర్‌ నిర్ణయం తీసుకోవటం వల్లే ఆ బిల్లులు అలాగే నిలిపోయాయనే చెప్పాలి. ఎటువంటి విధానాన్ని పాటించకపోవటం వల్లే ఈ బిల్లులు దుర్గగుడిలో కదలక నిలిచిపోయాయి. మొత్తం 24 లక్షల రూపాయల బిల్లులు అలాగే నిలిచిపోవటంతో అటు పాలు, బిస్కెట్లు పంపిణీ చేసిన వెండర్లు ఆగ్రహం వ్యక్తం చేయటమే కాక.. సదరు విఎంసి ఉద్యోగిపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. కనీసం విఎంసి కమీషనర్‌ ప్రత్యేకమైన దృష్టి సారించి ఇబ్బందులను తొలగించే దిశగా అడుగులు వేయకపోవటం గమనార్హం. ఏదిఏమైనా దుర్గగుడి వర్సెస్‌ విఎంసి ల మధ్య సయోధ్య ఎప్పటికి నెలకొంటుందో వేచిచూడాలి.