సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ నేతల పాలాభిషేకం
#Telangana #revanth reddy #Congress
ఉప్పల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఉప్పల్ మరియు కుషాయిగూడ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల అప్‌గ్రేడేషన్ కోసం రూ.37.10 కోట్ల నిధులు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ఉప్పల్, కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం రూ.37.10 కోట్ల నిధులు మంజూరు కావడం సీఎం ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమైందన్నారు. విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచుతున్నారని, ఎన్ని ప్రచారాలు జరిగినా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల కోసం ప్రజలు నేరుగా కాంగ్రెస్ నాయకులను సంప్రదించాలని సూచించారు.
పాలాభిషేక కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డితో పాటు కంది ఆగిరెడ్డి, తాఫిక్, బకారం లక్ష్మణ్, రఫీక్, విజయ్, రాజేష్ ముదిరాజ్, శ్రీకాంత్ గౌడ్ తదితర డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోపనపల్లి సుధాకర్ రెడ్డి, చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి, బజారు జగన్నాథ్ గౌడ్, కొంపల్లి బాలరాజ్ ముదిరాజ్, ఈగ ఆంజనేయులు, శ్రవణ్ రెడ్డి పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ నాయకులు ఆకారపు అరుణ్, బ్లాక్ సెల్ అధ్యక్షుడు లింగంపల్లి రామకృష్ణ, బ్లాక్ అధ్యక్షురాలు అమరేశ్వరి, ప్రకాష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.