రూయా ఆసుపత్రి అభివృద్ధికి ₹5 కోట్ల ఆమోదం..

May 27, 2026 - 20:53
 0  3
రూయా ఆసుపత్రి అభివృద్ధికి ₹5 కోట్ల ఆమోదం..

తిరుపతి జిల్లా కలెక్టరు డాక్టర్ యస్.వెంకటేశ్వర్, స్థానిక శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన వేంకటేశ్వర వైద్య కళాశాల సమావేశ మందిరంలో యస్.వి.ఆర్.ఆర్.ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి మండలి సమావేశం బుధవారం జరిగింది. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తాను కూడా వైద్య విద్యార్హతతో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అయినందున రాయలసీమలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రూయా ప్రభుత్వాసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి పరచి పేషంట్లకి నాణ్యమైన వైద్యం త్వరితగతిన సరైన సమయంలో అందించే విధంగా పలు సూచనలు చేశారు. అందుకు అనుగుణంగా చేపడుతున్న కార్యక్రమాలను క్షుణ్ణంగా చర్చింతారు. 25 లక్షల వ్యయంతో క్యాజువాలిటి, AMC, ASC, ACCU మరియు RICU వార్డులలో విద్యుత్ పనులు, కొత్త AC యూనిట్ల కొనుగోలు మరియు ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థల మరమ్మత్తులు ఏర్పాటు చేయుట. అత్యవసర OT కోసం సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో GE అనస్థీషియా వర్క్స్టేషన్ ఒకటి అత్యవసరంగా అధీకృత డీలర్ల ద్వారా కొనుగోలు చేయుట. మరో 12 లక్షల రూపాయలతో జనరల్ సర్జరీ విభాగంలో ఫిస్టులెక్టమీ మరియు హీమరాయిడెక్టమీ వంటి ఆధునిక శస్త్రచికిత్సల కోసం LASER పరికరాల కొనుగోలు చేయుటకు అంగీకరించారు.అదే విధంగా 16 లక్షల రూపాయలతో, నిర్ధారణ సేవలను బలోపేతం చేయుటకు Bio-Rad, HB Electrophoresis, D-10 System, ERBA H360 Hematology Analyzer Coagulation Meter ERBA ECL 412 55 కొనుగోలుకు, రేడియాలజీ విభాగానికి 10 లక్షల రూపాయలతో 15 CR కాసెట్లు కొనుగోలు చేయుటకు. పిల్లల విభాగంలోని రోగి సహాయకుల అమినిటీస్ బ్లాక్ లో 5 లక్షల రూపాయలతో మరమ్మత్తులు మరియు నిర్వహణ పనులు చేపట్టుటకు, 8 లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో ప్రధాన ఆపరేషన్ థియేటర్, బర్న్ వార్డు, ఆర్థో వార్డు, పీడియాట్రిక్ సర్జరీ మరియు TBCD వార్డులకు కలిపి మొత్తం 14 రెండు టన్నుల కెపాసిటి గల AC ల కొనుగోలుకు ఆమోదించారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధిగ్రస్థుల వసతి కొరకు నిర్మించిన కొత్త TB & CD బ్లాక్ లో 55 లక్షల రూపాయల వ్యయంతో ఎయిర్ మరియు సెంట్రల్ సెక్షన్ సిస్టమ్లు, 5 మల్టీ ఛానల్ మానిటర్లు మరియు 5 వెంటిలేటర్ల ఏర్పాటుకు కూడా ఆమోదించారు. జాతీయ వైద్య మండలి నిభంధనల మేరకు ఆసుపత్రి ప్రాంగణంలో భద్రత మరియు పేషెంట్ సేఫ్టీ కోసం 8 లోలల రూపాయల వ్యయంతో 50 CCTV కెమెరాల ఏర్పాటుకు కూడా అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా దివ్యాంగుల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న వైద్య పరీక్షల కొరకు ఆర్థోపేడిక్ విభాగంలో SADAREM సేవల కోసం 15 లక్షల రూపాయల వ్యయంతో ప్రత్యేక OPD బ్లాక్ ఏర్పాటుకు ఆమోదించారు. వలన అంటు ప్రధులు ప్రబలకుండా ఆసుపత్రి ప్రారంభం నుండి కూడా ఓపెన్ సీవేజి మరియు డ్రైనేజి కాలువను 43 లక్షల రూపాయల వ్యయంతో జనరల్ OP భవనం నుండి మార్చురీ భవనం వెనుక భాగం వరకు, 1000 మి.మీ. RCC పైడ్లైన్ వేయుట ట ద్వారా ద్వారా. అంటువ్యాధుల ప్రబలకుండా చర్యలు చేపట్టుటకు ఆమోదించారు. చిన్న పిల్లల విభాగం బలోపేతానికి 4 లక్షల రూపాయల వ్యయంతో వ్యాక్సినేషన్ గది మరియు అమినిటీ ప్రాంతాలలో పటిష్ఠ శుభ్రత, భద్రత కొరకు పక్షుల ప్రవేశాలను నిరోధించే ఏర్పాటుకు మరియు మరమ్మత్తులు చేపట్టుటకు, (MS- వార్డులు -1 నుండి VII వరకు ఉన్న ప్రాంతాలలో దెబ్బతిన్న మురుగు పైప్లైన్లు మరియు చాంబర్లసుమారు 70 సంవత్సరాలకు పైబడిన యెయిన్ బిల్డింగ్లో అప్పట్లో నిర్మించిన సిమెంట్ పైప్లైన్లు తరచూ పగిలిపోయి చాలా అసౌకర్యంగా ఉన్నందున వాటి స్థానంలో 5 లక్షల రూపాయల ఖర్చుతో PVC పైర్లైన్ల ఏర్పాటుకు ఆమోదించారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు OPD రిజిస్ట్రేషన్లు, PM RAHAT, IRAD డేటా నిర్వహణ కోసం 5 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకం మరియు అత్యవసర సేవల కోసం ఇద్దరు ఎలక్ట్రిషియన్లు, ఒక హెలర్, ఇద్దరు ప్లంబర్లు, ఒక కార్పెంటర్, ఒద్దరు ఫార్మసిస్టులు మరియు ముగ్గురు డ్రైవర్ల నియామకం కొరకు కూడా అనుమతిస్తూ తీర్మానించారు. సర్జికల్ ఆంకాలజీ బ్లాక్ లో 20 లక్షల వ్యయంతో పేషంట్ల సౌకర్యార్ధము లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటుకు ఆమోదించారు. 6 లక్షల రూపాయల వ్యయంతో పాత కార్డియాలజి బ్లాక్ భవనాల కూల్చివేసి మట్టిని తొలగించి కొత్త భవనాల నిర్మాణానికి మార్గం సుగమం చేయుటకు అనుమతి కోరుతూ తీర్మానించారు. సుమారు 58 లక్షల రూపాయల వ్యయంతో డైట్ భవనం నుండి సీనియర్ రెసిడెన్సీ హాస్టల్ వరకు CC రోడ్డు నిర్మాణం చేపట్టవలసిన ఆవశ్యకతను చర్చించి ఆమోదించారు. ప్రస్తుత ఎమర్జెన్సీ భవనం ఎదురుగా పార్కింగ్ ప్రాంతలో ఆసుపత్రిని సందర్శించే ప్రజల సౌకర్యార్థం 15 లక్షల రూపాయల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణం కొరకు, ఆప్తల్మాలజీ విభాగానికి A- ఐబీబిదీ మరియు Phaco యంత్రాల కొనుగోలుకు 23 లక్షల రూపాయలు కేటాయింపుకు అంగీకరించారు. 18 లక్షల రూపాయల వ్యయంతో సెంట్రల్ AC సిస్టమ్ మరమ్మత్తులు మరియు మాడ్యులర్ OT 8 AMC ఖరారు చేయుటకు మరో 16 లక్షల రూపాయల వ్యయంతో ఆసుపత్రిలో ఉన్న 350 AC యూనిట్లకు AMC ఖరారు చేయుటకు, ఎమర్జెన్సీ వార్డుల్లో AMC, ASC, ACCU మరియు RICU వార్డులలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా UPS బ్యాటరీల మరమ్మత్తు మరియు మార్పిడి పనులకు మరో 16 లక్షల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా వైద్య విద్యార్థులకోసం 10 లక్షల రూపాయల వ్యయంతో క్లినికల్ లెక్చర్ గ్యాలరీలో ఫాల్స్్సలింగ్, ఎలక్ట్రికల్ కేబ్లింగ్, ఎకో సిస్టమ్ మరియు కొత్త AC ల ఏర్పాటు ద్వారా పునరుద్ధరణ పనులు చేపట్టుట మరియు మరో 10 లక్షల రూపాయల వ్యయంతో పీడియాట్రిక్స్, జనర్ మెడిసిన్ మరియు జనరల్ సర్జరీ PG సెమినార్ హాళ్లలో మరమ్మత్తులు మరియు పునరుద్ధరణ పనులు చేపట్టుటకు కూడా ఆమోదించారు. PICU విభాగంలో మరమ్మత్తులు, సదుపాయాల మెరుగుదల మరియు అప్గ్రేడేషన్ పనులు చేపట్టుటకు మరో 10 లక్షల రూపాయల వ్యయానికి కూడా ఆమోదించారు. ఈ వేసవి ప్రారంభంలో జిల్లా కలెక్టర్ స్వయంగా చొరవ తీసుకొని పేషంట్లు మరియు వారి బంధువులు ఆసుపత్రి ప్రాంగణంలో ఎండ తీవ్రత వేడిమి నుండి రక్షణ పొందుటకు 14 లక్షల రూపాయల వ్యయంతో చలువ పందిల్లు, ఏర్పాటు చేయడమైనది. ఈ వ్యయం కొరకు కూడా చర్చించి ఆమోదించారు. జిల్లా కలెక్టర్  వీటితో పాటుగా ఎబోలో వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకున్న చర్చలను కూడా సమీక్షించారు. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్  అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 40 కోట్ల రూపాయల వ్యయంతో నూతనముగా నిర్మితమవుతున్న క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణ స్థితిగతులను గూర్చి ప్రారంభించడానికి ఉన్న అవకాశం గురించి ఎ.పి.యం.ఎస్.ఐ.డి.సి. ఇంజనీరింగ్ అధికారులను సమీక్షించారు. స్థానిక శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐవిఆర్యాస్. సర్వేలో ప్రజల అభిప్రాయ సేకరణలో రాష్ట్రంలోనే మన రూయా ఆసుపత్రి అగ్రస్థానంలో ఉండే విధంగా డాక్టర్లు, సిబ్బంది ప్రతి ఒక్కరూ పేషంట్ల సంక్షేమానికి కట్టుట్టడి కృషి చెయ్యాలని సూచించారు. ఈ కార్యక్రమములో అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు సూపరింటెండెంట్ శ్రీ వేంకటేశ్వర రామ్ నారాయణ్ రూయా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ మనోహర్, ప్రిన్సిపాల్ డాక్టర్ రవిప్రభు, కమీషనర్ నగరపాలక సంస్థ శారదా దేవి, ఇంచార్జ్ డి.యం.హెచ్.ఓ. డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్, ఏపీ ఎం ఎస్ ఐ డి సి విభాగ అధిపతులు,  ఆసుపత్రిలోని పలు విభాగాల అధిపతులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లు, మునుస్వామి,  సందీప్, కాజా మొహిద్దిన్, లక్ష్మీపతి మరియు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.