పోలవరం ఆర్‌అండ్‌ఆర్ భూములు.. కప్పం వసూళ్ల కేంద్రమా?
#polavaram #andhrapradesh
పోలవరం ప్రాజెక్ట్.... ఏపీకి ఇది జీవనధార అని మనం చెప్ప్పుకుంటాం. కాని ఆ ప్రాజెక్ట్ కొందరికి ఏటీఎంలా మారింది. కాంట్రాక్టర్ల సంగతి పక్కన పెడితే... ఆర్ అండ్ ఆర్ కూడా డబ్బులు తెస్తుంది అంటే నమ్ముతారా? అవును ఆర్ అండ్ ఆర్ కోసం అంటే రీహాబిలిటేషన్ కోసం... ప్రాజెక్టు వలన తమ గ్రామాలు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇళ్లు కట్టి ఇస్తారు.. అదే ఆర్ అండ్ ఆర్. దాని కోసం విడిగా భూమిని సేకరిస్తారు. ఆ భూముల్లో ఇళ్లు కట్టి ఇస్తారు. అలా సేకరించారు.. ఇళ్లు కూడా కట్టి ఇచ్చారు. అయితే కొన్ని భూములు మిగిలిపోయాయి. ఒక వంద ఎకరాలు అలా మిగిలిపోయి జీలుగుమిల్లిలో ఉండిపోయింది. అయితే ఆ భూమి ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ కింద లెక్క. దీనికి ప్రొటెక్టర్ కలెక్టర్ అవుతారు.
కాని వంద ఎకరాలున్న ఆ భూముల్లో పామాయిల్ తోటలు సాగు చేస్తున్నారు. ఇది కమర్షియల్ పంట. కొన్ని కంపెనీలు ఆ చెట్లను కొంటారు. దానితో మంచి గిరాకీ. అందుకే కొందరు కలిసి ఆ భూముల్లో సాగు చేసుకుని సంపాదించుకుంటున్నారు. మరి పెద్దలు చూసి ఊరుకుంటారా? అంటే వాళ్లు ప్రశ్నించి వాటిని ప్రభుత్వానికి అప్పచెబుతారనుకుంటున్నారా... అబ్బే అలా చేస్తే వాళ్లు మన నేతలు ఎలా అవుతారు? ఇది ప్రభుత్వ భూమి మీరు చేయకూడదు.. కాని చేసుకోండి.. మాకు మాత్రం మా కప్పం మాకు చెల్లించండి అని ఆదేశమిచ్చారు. ఇది ఇప్పుడు కాదు గతంలో వైసీప హయాంలోనే జరిగింది.
ఇక కూటమి ప్రభుత్వం వచ్చింది. కొత్త నేతలు వచ్చారు. ఈసారి సీన్ మారుతుందేమో అనుకున్నారు. కాని మారలేదు. సాగు జరుగుతూనే ఉంది. పంటలు పండించుకుని సంపాదించుకుంటూనే ఉన్నారు. అయితే కొత్త నేత కూడా వచ్చి కప్పం అడిగారు... పాత నేత అడిగినదానికి డబల్ అంటే కోటి తీసుకుంటున్నాడంట. అదీ పరిస్ధితి. ఇంత జరుగుతున్నా మరి అధికారులు ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్ధితి. వారికి తెలుసా... తెలిసినా తెలియనట్లు ఉంటున్నారా అర్ధం కావడం లేదు. అయితే కలెక్టర్ దృష్టిలో అయితే ఈ విషయం లేదనే చెప్పుకుంటున్నారు.
ఇప్పుడు మనం ఆ నేత పేరు చెప్పలేం. ఎందుకంటే పండించుకుంటున్నవారు చెల్లిస్తున్నట్లు మనకు సాక్ష్యం ఇవ్వరు. మనకు ఆధారం దొరకదు. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా నేత పేరు చెబితే మళ్లీ అదో కేసు అవుతుంది. అందుకే వ్యవహారం అయితే నడుస్తుంది... లీజు వసూలు చేసుకుంటున్నారు.. అది ఎవరనేది అధికారులే తేల్చి... ఆ భూమిని స్వాధీనపర్చుకోవాలి.