ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలలో సిపిఎం

#cpm, #apnews, #latest

Mar 5, 2026 - 17:06
Mar 5, 2026 - 17:50
 0  5
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలలో సిపిఎం

తణుకు రూరల్ మార్చి 5 : ప్రజల కోసం ప్రజల్లో సిపిఎం నడుస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలం అన్నారు. ఎనిమిదవ రోజు ప్రజా చైతన్య యాత్ర దువ్వ గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. వీధి వీధినా తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇల్లు ఇళ్ల స్థలాలు సమస్యలపై మహిళలు వినతి పత్రాలు అంద చేశారు. ఈ సందర్భంగా గోపాలం మాట్లాడుతూ ఓట్లు వేయించుకున్న పాలకులు జనం సమస్యలు పక్కన పెట్టారని లడ్డూల చుట్టూ వారు తిరుగుతున్నారని సిపిఎం జనం బాట పట్టిందని అన్నారు. ఇల్లు ఇళ్లస్థలాల సమస్య పరిష్కరించడానికి పాలకులకు ఎన్ని సంవత్సరాలు కావాలో చెప్పడం లేదని అన్నారు. గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలం ఇస్తామని వాగ్దానం చేశారని అన్నారు. వాగ్దానాలు సంవత్సరాలు గడుస్తున్న నెరవేర్చకపోవడం దారుణమని అన్నారు. సిపిఎం ప్రభుత్వాన్ని పాలకులను కదిలించేందుకే పాదయాత్ర చేపట్టిందని అన్నారు. అంగన్వాడి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అంగనవాడిలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఎవరూ అంగీకరించరని గోపాలం ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం సమస్యలపై ఉద్యమాలు చేసే వారికి అండగా ఉంటుందని అన్నారు. ప్రజలు కలిసి వస్తే,కదిలి వస్తే సమస్యలు పరిష్కరించే వరకు ప్రజల పక్షాన సిపిఎం ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్  బల్ల చిన్న వీరభద్రం, దువ్వ గ్రామ నాయకులు,బండారు వెంకటేశ్వర్లు, దొంగల నాగేశ్వరరావు, పిండి సుబ్బారావు, తూము శ్రీను,ఎస్ వెంకటేశ్వరరావు అజయ్ కుమారి,  పూర్ణ, ఇంజేటి శ్రీనివాస్, కే క్రాంతి బాబు, మామిడి రామాంజనేయులు కానేటి బాలరాజు , ఎం ఆంజనేయులు బాతిరెడ్డి జార్జి, ఎం వైకుంఠరావు, కరెడ్ల రామకృష్ణ, పిల్లి ప్రసాదు, భూపతి సత్యనారాయణ, వెంకటరత్నం, రాము తదితరులు పాల్గొన్నారు.