కేశినేని బ్రదర్స్ మధ్య డైలాగ్ వార్

#kesineninani #kesinenichinni #vijayawada #politics #andhrapradesh

Jun 16, 2026 - 18:28
 0  3
కేశినేని బ్రదర్స్ మధ్య డైలాగ్ వార్

విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఎంపీ చిన్ని చేసిన ఆరోపణలకు మాజీ ఎంపీ కేశినేని నాని ఘాటుగా స్పందించారు. ప్రెస్‌మీట్‌లో తన అప్పులు, ఆస్తులు, ఆదాయం గురించి మాట్లాడిన చిన్ని, ఒక ప్రజాప్రతినిధిగా తన బాధ్యతలను మరిచిపోయినట్లు కనిపిస్తోందని విమర్శించారు. “నాన్నా పిట్టల దొర.. పిట్ట కథలు బాగా చెప్పావు” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

తనపై చేస్తున్న ఆరోపణలు నిజమైతే ప్రధాని, హోంమంత్రి, ఆర్థికమంత్రికి ఫిర్యాదు చేయాలని, సీబీఐ లేదా ఈడీ దర్యాప్తు కోరాలని సవాల్ విసిరారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తి చర్యలు తీసుకోవచ్చని సూచించారు. అయితే అవేమీ చేయకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. “ప్రజలు నీ కథలు నమ్మేంత అమాయకులు కారు” అంటూ చిన్ని వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఈ వ్యాఖ్యలతో కేశినేని సోదరుల మధ్య రాజకీయ విభేదాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.