చంద్రబాబే 15 ఏళ్లు సీఎం అంటున్న పవన్ కళ్యాణ్.. లోకేష్ మౌనం ఎందుకు..?
#politics #nara chandrababu naidu #naralokesh #andhrapradesh
కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని, చంద్రబాబే సీఎంగా ఉంటారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా చెబుతున్నారు. కానీ.. మంత్రి లోకేష్ ఆ విధంగా ఎందుకు చెప్పలేకపోతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడో ఆయనకు సీఎం అవ్వాలన్న కోరిక ఉందన్న అనుమానానికి ఆయనే తావిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు సీఎంను చేసిన పవన్ కళ్యాణే పూర్తిగా క్లారిటీతో ఉంటే.. లోకేష్ ఎందుకు అంత క్లారిటీగా లేరనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాను కూడా సీఎం అవ్వాలన్న కోరిక లోకేష్ ఉందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన ఒక సంఘటన ఏమిటంటే.. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్పాలనుకున్నది ఎందుకు చెప్పలేకపోయారు..? మనసులో వున్నది ఎందుకు బయట పెట్ట లేకపోయారు..? అనుభవం వున్న నేతే తడబడ్డారంటే.. ఎక్కడో ఏదో తేడా జరిగిందేమో. అసలు విషయానికోస్తే.. బుధవారం జరిగిన టీడీపీ నేతల పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, పల్లా శ్రీనివాస్ చేసిన ప్రసంగం సమయంలో.. ఏదో ఒక కొత్త విషయం చెప్పాలనుకున్నారు. చెప్పలేక తడబడ్డారు. ఎట్టకేలకు నోరు తెరిచారు. మళ్లీ అంటే 2029లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమని అంటూ.. టీడీపీ నేతే మళ్లీ సీఎం అవుతారన్నారు. అంతే కానీ చంద్రబాబు సీఎం అవుతారని డైరెక్టుగా చెప్పలేదు. ఆలా ఎందుకు చెప్పలేదో.. పల్లా అతి వెనుక ఏమన్నా జరిగిందేమో.. ఇంతలో మంత్రి లోకేష్, తెలివిగా ఆయనకు సైగ చేయగా, వెంటనే సర్దుకున్న పల్లా మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారన్నారు. ఆ మాట అనకుంటే.. మరో విధంగా ప్రచారం జరిగేది. దీంతో ఆ సమావేశానికి హాజరైన వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో కొందరు లోకేష్ అభిమానులే తెరవెనుకుండి ఆయన సీఎం అవుతారని ప్రచారం చేయించినా.. లోకేష్ ఖండించకపోవటంతో ఎక్కడో ఏదేదో జరుగుతుందని ప్రచారం జరిగింది. 2029లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం ఖాయం.. మళ్లీ చంద్రబాబే సీఎం అవుతారని, ఇంతవరకు లోకేష్ గట్టిగా చెప్పకపోవటంతో.. టీడీపీ నేతలలో కూడా అనుమానం కలిగింది. లోకేష్‌కి డైరెక్టుగా సీఎం అవ్వాలని ఉందా..? కారణం ఏమిటంటే.. పేరుకే కూటమి ప్రభుత్వం.. పేరుకే చంద్రబాబు సీఎంగా వున్నారు. పెత్తనం అంతా లోకేష్‌తోపాటు, ఆయన కోటరీ సభ్యులే చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. టీడీపీలో అదే పరిస్థితి. నామినేటెడ్ పోస్టులుతోపాటు, పార్టీ నాయుకులకు పోస్టులివ్వటం అంతా.. లోకేష్ కనుసన్నుల్లోనే జరిగింది. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ వన్ పోస్టుల బదిలీలు, పోస్టింగ్‌లలో చంద్రబాబు ప్రభావం కన్నా, లోకేష్ ప్రభావమే ఎక్కువగా పనిచేస్తున్న నేపథ్యంలో.. ఆయనకు సీఎం పోస్టు అవసరమా..? అన్న గుసగుసుల కూడా వినిపిస్తున్నాయి. నిజంగా లోకేష్‌కి ఆ కోరిక బలంగా ఉంటే.. అది టీడీపీని పూర్తిగా నాశనం చేయటం ఖాయమని.. టీడీపీ అభిమాన రాజకీయ విశ్లేషకులే హెచ్చరిస్తున్నారు. సీఎంగా తాను లేకున్నా, చంద్రబాబు వున్నా, పెత్తనం చేసేది తానేనని, లోకేష్‌కి తెలిసినపుడు, ఆయన సీఎం పోస్టును కోరుకుంటారా..? అంత తెలివితక్కువగా లోకేష్ ఆలోచిస్తారా..? అన్నది ఆ దుర్గమ్మకే తెలియాలి.