బాలినేని అసలు ప్లానేంటి?
బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మధ్యే పవన్ కల్యాణ్‌తో మీటింగ్ అయ్యారు. అంతకు ముందు జగన్ ఒంగోలు వచ్చినప్పుడు ఈయన గురించే మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో బాలినేని శ్రినివాసరెడ్డి హవా అందరికీ తెలిసిందే. జగన్ దగ్గరి బంధువు అయిన బాలినేని శ్రినివాసరెడ్డి ఇప్పుడు జనసేనలో ఉన్నారు. అయితే జనసేనలో కూడా అంటీ ముట్టనట్టే ఉంటున్నారు. పెద్దగా యాక్టివ్‌గా చేసిందేమీ లేదు. ఈ మధ్య కాలంలో తిరుమల లడ్డు అంశం వస్తే.. అందులోనూ తన ప్రత్యర్ధి వైవీ సుబ్బారెడ్డి ఉన్నందున రెస్పాండ్ అయి... విమర్శలు విసిరారు. అది తప్పితే బాలినేని పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నది లేదు అయితే బాలినేని ఎన్నికల సమయానికి మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోతారనే ప్రచారం జరిగింది. మొన్న జగన్ ఒంగోలు వచ్చిన సమయంలో ఇది మరింత గట్టిగా జరిగింది. అందుకేనేమో పవన్ కల్యాణ్ వెంటనే బాలినేనిని పిలిపించుకుని మాట్టాడారు.
అయితే తాను జనసేనతోనే ఉంటానన్నట్లు బాలినేని సిగ్నల్స్ ఇచ్చేశారు. అయినా అందరి మనసులో ఇంకా డౌట్స్ ఉన్నాయి. అయితే ఈసారి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో పోటీ చేయడం లేదనేదే కొత్త విషయం. అదే ఆయన అసలు ప్లాన్. అవును ఆల్రెడీ టీడీపీ నుంచి దామరచర్ల జనార్ధన్ ఉన్నారు.. ఆయన మీదే మొన్నటి ఎన్నికల్లో బాలినేని ఓడిపోయారు. అయితే వైసీపీ అభ్యర్ధిగా రవి నాయుడిని మొన్న జగన్ ప్రకటించారు. జనార్ధన్ కమ్మ అయితే రవినాయుడు కాపు.. సో ఒంగోలు కమ్మ వర్సెస్ కాపుగా నడుస్తుందని.. అప్పుడు జనసేన నుంచి బాలినేని రెడ్డి సామాజికవర్గం తరపున దిగితే.. కాపు ఓట్లు అన్నీ రావని.. అప్పుడు నష్టం జరుగుతుందనే అనాలిసిస్ తెర మీదకు వచ్చింది. అయితే జగన్ నిర్ణయం ముందే తెలుసని.. అందుకే బాలినేని తన ప్లాన్‌లో తానున్నారని అంటున్నారు.
బాలినేని ఈసారి మార్కాపురం నుంచి జనసేన తరపున బరిలోకి దిగుతారని తెలుస్తోంది. మార్కాపురం ఈక్వేషన్లలో వర్కవుట్ అవుతుందని రెడ్డి, కాపు ఓట్లు మద్దతుతో బాలినేని గెలుపుకు ఈజీ అవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఒంగోలు నుంచి తప్పుకుని మార్కాపురం వైపుకు బాలినేని వెళ్లాలని ఫిక్స్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.