అయితే రూల్ మార్చండి.. లేదా వాళ్లను తీసేయండి
’’ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వాడుకుంటున్న ఏ వ్యక్తి అయినా సరే మతాన్ని మార్చుకుంటే ముఖ్యంగా హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతానికి మారితే వారు ఆ రిజర్వేషన్ వాడుకోవటానికి అనర్హులు. వారు వెంటనే పదవిని వదిలేయాలి.’’ ఇది భారత రాజ్యాంగం పెటిన రూల్. దీనిని చాలా కేసుల్లో సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టులు కన్ ఫామ్ చేశాయి కూడా. అయినా మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చాలా మంది ప్రజాప్రతినిధులు ఇప్పటికీ క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తూనే.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను మాత్రం అనుభవిస్తూ పదవుల్లో ఉంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చాలామంది ఉన్నారు. అటు తెలుగుదేశం, ఇటు వైసీపీ రెండిట్లోనూ ఇలాంటివాళ్లు ఉన్నారు. కాకపోతే జనరల్ గా ఇలాంటి వాళ్లు వైసీపీలోనే ఎక్కువ. వీరి ఇళ్లలో పెళ్లిళ్లు, చావులు అన్నీ క్రిస్టియానిటీ ప్రకారమే జరుగుతాయి. బయటకి చూపించే వీడియోల్లో రిసెప్షన్లు లేదా సంతాపసభలు మాత్రమే చూపిస్తారు. ఎందుకంటే ఎలాంటి ఎవిడెన్స్ దొరికినా వీరిని పదవి నుంచి తీసేయాలని ఎవరైనా కంప్లయింట్ చేయొచ్చు. కాని ఎవరూ కంప్లయింట్ చేయరు.. ఎవరూ ప్రూవ్ చేయడానికి ప్రయత్నించరు.. ఎందుకంటే అది కష్టమే పైగా అధికారంలో ఉన్నవాళ్లు అయితే ఇంకా కష్టం. వారి దగ్గర ఇప్పటికే అంగబలం, ఆర్ధిక బలం ఉంటాయి.. దానితో వాళ్లు దేనిని అయినా మేనేజ్ చేయగల కెపాసిటీతో ఉంటారు. అలాంటివారిని ఢీకొట్టాలంటే ఒక రాజకీయ నాయకుడు అయి ఉండాలి.. లేదా పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి. సామాన్యుడు చేయలేడు.
నేడు మండలిలో ఓ సీన్ చూశాం. మండలి ఛైర్మన్ మోషేన్ రాజును మీరు క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు సంబోధించడంతో రగడ జరిగింది. మోషేన్ రాజు వెంటనే నేను క్రిస్టియన్ కాదు హిందువుని అని చెప్పారు. ఆయన పేరు మోషేన్ రాజు, ఆయన తల్లి పేరు మరియమ్మ. అయినా ఆయన హిందువే. అదే ఆయన చెప్పారు. కాని ఈ ఘటనతో మండలిలో పెద్ద రచ్చే జరిగింది. అచ్చెన్నాయుడు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. అక్కడ డిమాండ్ చేసిన చాలామందిలో పైన మనం చెప్పుకున్న బాపతే. ఎమ్మెల్యేలలోనూ అలాంటివారు ఉన్నారు. పైగా వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు అన్ని కార్యక్రమాల్లో క్రిస్టియానిటీ ఫాలో అవుతారు.. మరోవైపు రాజకీయం కోసం యజ్ణాలు యాగాలు హిందూ మతాచారం ప్రకారం చేసి నటిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఆయన డబల్ యాక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మండలి ఘటనతో ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తూ క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నవారి గురించి చర్చ మొదలైంది.
ఇప్పటికైనా కేంద్రం అయినా కలగచేసుకుని అలా రూల్ వయిలేట్ చేస్తున్నవారిని పదవుల నుంచి తొలగించాలనే డిమాండ్ తెర మీదకు వస్తుంది. లేదా అది కరెక్టు కాదనుకుంటే రూల్ అయినా మార్చేయండి.