డా. ఆడారి కిషోర్ కుమార్ గ్రంథావిష్కరణ ఘనంగా – మహిళా సాధికారతకు నూతన దిశ 

Mar 30, 2026 - 14:50
Mar 30, 2026 - 15:01
 0  6
 డా. ఆడారి కిషోర్ కుమార్ గ్రంథావిష్కరణ ఘనంగా – మహిళా సాధికారతకు నూతన దిశ 

సబ్బవరం లోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (DSNLU)లో నిర్వహించిన డి.వి. సుబ్బారావు జాతీయ మిడియేషన్ పోటీలు మార్చి 27, 28, 29 తేదీలలో విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి. సూర్య ప్రకాశ రావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రముఖ స్కాలర్ డా. ఆడారి కిషోర్ కుమార్ రచించిన

“Women Empowerment through Constitutional and Other Laws – A Socio Legal Study with Special Reference to Anakapalli District, Andhra Pradesh” గ్రంథాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు న్యాయపతి విజయ్, చల్లా గుణరంజన్ మరియు గోవా ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆర్. వెంకటరావు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అతిథులు మహిళా సాధికారతపై సమగ్ర పరిశోధనతో రూపొందిన ఈ గ్రంథం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అభినందించారు.

ఈ కార్యక్రమంలో న్యాయవిద్యార్థులు, అధ్యాపకులు, న్యాయ నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ గ్రంథంలోని ముఖ్యాంశాలు:

  • మహిళలకు రాజ్యాంగ పరిరక్షణలు
  • మహిళల రక్షణకు ఉన్న వివిధ చట్టాల ప్రభావం
  • సాధారణ మరియు వ్యక్తిగత న్యాయ అవగాహన ద్వారా మహిళా సాధికారత
  • ప్రాచీన కాలం నుండి ఆధునిక భారతదేశం వరకు మహిళల స్థితిగతులు
  • రాజ్యాంగం మరియు ఇతర చట్టాల ద్వారా మహిళా సాధికారత
  • మహిళా సాధికారతపై న్యాయస్థానాల దృక్పథం
  • అనకాపల్లి జిల్లా ప్రాధాన్యతతో సామాజిక-న్యాయ అధ్యయనం
     

మహిళా సాధికారతకు దోహదపడే ఈ గ్రంథం న్యాయ రంగంలో విలువైన మార్గదర్శిగా నిలుస్తుందని విశేషంగా కొనియాడారు.