డిఏ బకాయిల రిలీజ్‌ డేటెప్పుడు.. సారూ?

#vijayawada #DA #VMC #andhrapradesh

Apr 23, 2026 - 18:07
Apr 24, 2026 - 10:08
 0  47
డిఏ బకాయిల రిలీజ్‌ డేటెప్పుడు.. సారూ?

కుమార్ చంద్.పి

కోట్ల రూపాయల డిఏ బిల్లులు పాస్‌ చెయ్యకుండా జాప్యం చేస్తున్నాడొక ప్రభుత్వ అకౌంట్స్‌ ఆఫీసరు.. సర్క్యులర్‌ ఇచ్చినా ఇంకా జాప్యం చేస్తావా అంటూ.. ఫైళ్ళను ఆ సదరు సారు ముఖం మీద కొట్టాడు పెద్దసారు.. విషయం ఏంట్రా అంటే.. అరె.. ఏం లేదు ఉత్తుత్తినే అంటూ తర్వాత బుజ్జగించాడట పెద్దసారు. ఇది అంతా ఎందుకని ఆరా తీస్తే.. పెద్దసారే.. చిన్న సారుకు చెప్పి డిఎ బకాయిలు నిలుపుతున్నాడన్నది విశ్వసనీయ సమాచారం. ఇంత ఉపోద్ఘాతమేంటా అని ఆలోచిస్తున్నారా.. ఆ మాత్రం ఉపోద్ఘాతం ఉండాల్సిందే ఎందుకంటే..అన్ని సంవత్సరాల జాప్యం చేస్తున్నారు వీఎంసి ఉన్నతాధికారులు వియంసి ఉద్యోగులకు డిఎలు ఇవ్వకుండా వాటిని పాస్‌ చేయకుండా తొక్కిపెట్టి ఉంచి వివరణ అడిగితే,, తూ తూ మంత్రపు మాటలు చెప్పి విలేఖరులను తప్పుదోవ పట్టిస్తున్నారు. అస్సలు కథ ఏంటంటే.. 

పేరుకే నగరపాలక సంస్థ.. పాలక సంస్థ అయ్యుండి కూడా పాలన సరిగా చేయలేక.. ఉద్యోగుల సమస్యలు తీర్చలేక సతమతమవుతోంది విజయవాడ నగరపాలక సంస్థ. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ లో విఎంసి ఉద్యోగులకు 2019 సంవత్సరంకు ముందు జీతాలు విఎంసి జనరల్ ఫండ్‌ నుంచీ విడుదలయ్యేవి. 2019 ఏప్రిల్ నుండి నగరపాలక సంస్థ ఉదోగుల జీతములు 010 ద్వారా ట్రెజరి నుండి వస్తున్నాయి. 2019 నుండి ఇప్పటివరకు అనగా 2019 TO 2025 వరకూ మొత్తం 8 DA లు ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ జీతంలో కలిసినవి, అలాగే ఈ DA లకు సంబంధించి బకాయి (ARREARS) ఇప్పటి వరకూ ఎవరికీ ఇవ్వకపోగా, VMC లో బిల్లులు చేసి పంపక పోవడం గమనార్హం. 

విషయమేమంటే.. ఒకవేళ బిల్లు జరిగి ఉండి ఉంటే CPS ఉద్యోగులకి 90 శాతం నగదు రూపంలో,, అదేవిధంగా మిగిలిన 10 శాతం PRAN ACCOUNTS లో జమ అయ్యి ఉండేది అలాగే పాత పింఛను ఉద్యోగులకి 100 శాతం PF ACCOUNT లో జమ అయ్యి ఉండేది. 2019 TO 2025 వరకూ వచ్చిన మొత్తం 8 DA ల లో GO NO: 14 (15 నెలలు), GO NO: 94 (9 నెలలు), GO NO: 51 (3 నెలలు) ల నుండి మొత్తం 27 నెలల బకాయిలు (ARREARS) నగరపాలక సంస్థ నుండి చెల్లించవలసి ఉంది అదేవిధంగా వీటికి సంబందించిన బిల్లులు కుడా ఇప్పటి వరకూ చేయని కారణం గా ఎవరికి డబ్బులు రాని పరిస్థితి ఏర్పడింది. 

2004 లో పించను విధానం ఆగిపోయి CPS విధానం అమలు లోకి వచ్చిన నాటినుండి నగరపాలక సంస్థ నందు 2004 TO 2019 (MARCH) మధ్య కాలము నందు అపాయింట్ అయిన సుమారు 600 మంది ఉదోగులు ఎవరికి PRAN ACCOUNTS లేని కారణంగా జీతం నుండి రికవరీ చేసిన CPS అమౌంట్, మరియు DA, PRC and INCREMENT బకాయి (ARREAR) నందు మినహాయించిన CPS అమౌంట్ ఇప్పటివరకు PRAN ఎకౌంటు నందు జమ కాలేదన్నది వాస్తవం. 2019 ఏప్రిల్ లో ట్రెజరి జీతములు కారణం గా PRAN ACCOUNTS తెరచి అప్పటి నుండి మొదలు 010 ద్వారా ట్రెజరి నుండి నుండి వచ్చే జితములలో మినహా ఇంచిన CPS అమౌంట్ PRAN ACCOUNTS లో జమ అగుచున్నది. 

2019 నుండి 2025 మధ్య కాలం నందు వచ్చిన 8 DA లలో VMC GENERAL FUND నుండి రావలసిన 27 నెలలకు సంబందించిన బకాయి (ARREAR) బిల్లులు CPS మరియు OPS (PF) ఉద్యోగులకి విడి విడి గా చేసుకొనుటకు అనుమతి ఇవ్వవలసి ఉండగా... 2019 నుండి 2025 మధ్య కాలం నందు వచ్చిన 8 DA లకు సంబందించి బకాయి (ARREAR) బిల్లులుCPS మరియు OPS (PF) ఉద్యోగులకి విడి విడి గా చేసుకొనుటకు CFMS and NIDHI పోర్టల్స్ తో మాట్లాడి అవకాశం కల్పించవలసి ఉండగా అది కూడా జరుగలేదు. 2004 TO 2019 (MARCH) మధ్య కాలము నందు అపాయింట్ అయిన ఉద్యోగులకి జీతం నుండి రికవరీ చేసిన CPS అమౌంట్ PRAN ACCOUNTS నందు జమచేయ వలసి కూడా ఉంది. సదరు డిఎల విషయమై కమీషనర్ ను ఉద్యోగులు కలిసి ఉండగా.. డిసెంబర్ లో ఒకసారి కలిసినప్పుడు అసిస్టెంట్ కమీషనర్‌ను విచారణ చేయాలని ఆదేశించినా ఫలితం లేదు. 

ఇక సదరు చిట్టపద్దు లెక్కల సారును పాయింట్ మీడియా వివరణ కోరగా.. ఇప్పుడు డబ్బులు లేవు,, ఏడేళ్ళుగా ఎవ్వరూ అడగనివి ఇప్పుడు అడిగితే నేనెందుకు చేయాలి,, మార్చ్ కలెక్షన్ వస్తే చేస్తాను,, ఈ బిల్లులు ప్రభుత్వం నుండి రావాలి,, అని పలు కారణాలు చూపుతూ జాప్యం చేస్తున్నారు చిట్టాపద్దుల సారు. ఇక జనవరిలో సర్కులర్ వచ్చినా ఇప్పటి వరకూ అంటే 4 నెలలు గడుస్తున్న ప్రయోజనం శూన్యం అనే చెప్పాలి. ఇక అందరి ముందు ఫైళ్ళను ముఖంపై విసిరేసే పెద్ద సారు ఏం స్పందిస్తారో.. ఎప్పటికి ఉద్యోగులకు డిఎ బకాయిలను విడుదల చేస్తారో వేచి చూడాలి.