చికెన్ షాపులు మూతపడుతున్నాయా..?
చికెన్ షాపుల బంద్‌కు నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇందుకు ప్రధానంగా పౌల్ట్రీ కంపెనీల విధానాలే కారణమంటున్నారు చికెన్ వ్యాపారులు. తమకు వచ్చే లాభాలు తక్కువగా ఉందని.. కొద్ది రోజులుగా తీవ్ర నష్టాలు ఎదుర్కుంటున్నట్లు చికెన్ వ్యాపారులు వాపోతున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులను బంద్ చేయాలని వ్యాపారులు ప్రకటించారు. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ తమకు సరిపోవడం లేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో చికెన్ ధరలు పెరిగినా కూడా.. మధ్యవర్తుల విధానాల వల్ల తమకు నష్టం జరుగుతోందంటున్నారు. ఇదే విషయాన్ని పౌల్ట్రీ సంస్థలకు ఎన్నిసార్లు తెలిపినా కూడా.. వారి నుంచి సరైన స్పందన రావటం లేదని.. తమ డిమాండ్ల పరిష్కారం కోసమే చికెన్ షాపులు మూసేస్తున్నట్లు తెలిపారు. ఆక్వా రంగానికి చేయుత ఇస్తున్న ప్రభుత్వం.. పౌల్ట్రీ పరిశ్రమపై శ్రద్ధ చూపించటం లేదని పౌల్ట్రీ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి చికెన్ షాపులు మూసి వేస్తున్నట్లు వ్యాపారులు ప్రకటించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.