కలెక్టర్ పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు

#social Media #collector #NTR district #andhrapradesh

Jun 18, 2026 - 15:31
 0  2
కలెక్టర్ పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ G. లక్ష్మీష పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించిన సైబర్ కేటుగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కలెక్టర్ పేరుతో ఫేక్ ఖాతాలు తెరిచినట్లు వెల్లడైంది.

ఈ నకిలీ ఖాతాలను గుర్తించిన కలెక్టర్ లక్ష్మీశా ప్రజలను అప్రమత్తం చేశారు. తన పేరుతో ఉన్న సోషల్ మీడియా ఖాతాలను ఎవరూ నమ్మవద్దని, వాటి ద్వారా వచ్చే సందేశాలకు స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా డబ్బు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఎవరైనా సంప్రదిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయాలని సూచించారు.

సైబర్ నేరగాళ్లు అధికారుల పేర్లను ఉపయోగించి మోసాలకు పాల్పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. అనుమానాస్పద ఖాతాలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం అందించాలని కోరారు.