"గ్రామీణ ప్రాతం క్రీడాకారుల ప్రోత్సాహమే లక్ష్యం"

#Andhrapradesh #నాదెండ్లమనోహర్ #sports

Jun 9, 2026 - 11:08
 0  6
"గ్రామీణ ప్రాతం క్రీడాకారుల ప్రోత్సాహమే లక్ష్యం"

గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఘనంగా ముగిశాయి. పోటీలలో విజయం సాధించిన విజేతలకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు లక్షల రూపాయల నగదు బహుమతి చెక్కును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభగల క్రీడాకారులను గుర్తించి వారిని అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

పటమట లోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో గుడిపాటి ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సీతారాం ఆధ్వర్యంలో ఈనెల ఆరవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ 2026 పోటీలు జరిగాయి. ఆంధ్ర తెలంగాణ నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొన్నారు అండర్ 11,13,15 విభాగాలలో బాలురు సింగిల్స్ డబుల్స్ బాలికలు సింగిల్స్, డబుల్ మిక్స్ డబుల్ మధ్య పోటీలు రసవత్తంగా సాగాయి. మూడు విభాగాలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ముగింపు సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేశారు అనంతరం. కే సుహాస్ అనే బాలుడికి నాదెండ్ల లలితా భాస్కరరావు అవార్డును కూడా అందజేసి సుహాస్ ను అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడం అంత సులువు కాదని, ఒక క్రీడాకారుడికి ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఒక్కోసారి అవకాశాలు దొరకని పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నారు. అటువంటిది గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆరు అధునాతన బ్యాడ్మింటన్ కోర్టులతో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసి ఇంత పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఒక మంచి స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసి యువతకు శారీరక దృఢత్వంతో పాటు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను (ట్రైనింగ్ ప్రోగ్రామ్స్) అందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణ ద్వారా భవిష్యత్తులో మన దేశానికి, రాష్ట్రానికి క్రీడాకారులు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ టోర్నమెంట్‌లో ఫైనల్ సెట్ వరకు ప్రతిభ చూపి 18-16 పాయింట్ల వరకు క్రీడాకారులు తలపడ్డ తీరు వారి పట్టుదలకు నిదర్శనమని మంత్రి కొనియాడారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అలవరచుకోవాలని, అదే స్పిరిట్ జీవితంలో మరిన్ని విజయాలు సాధించడానికి దోహదపడుతుందని పిలుపునిచ్చారు. క్రీడల ద్వారా జీవితంలో క్రమశిక్షణ (డిసిప్లిన్) అలవడుతుందని, తాను కూడా ఒక క్రీడాకారుడిగా ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి వచ్చానని గుర్తుచేసుకున్నారు.

ఈ టోర్నమెంట్‌లో దాదాపు 1000 మంది క్రీడాకారులు పాల్గొనడం గొప్ప విషయమని, ఇంత చిన్న వయసులో పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించి తీసుకువచ్చిన తల్లిదండ్రులకు, వారిని సొంత బిడ్డల్లా భావించి అద్భుతమైన శిక్షణ ఇస్తున్న కోచ్‌లకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజేతలకు 2 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం వారి భవిష్యత్తుకు తొలి అడుగుగా భావించాలన్నారు.

భవిష్యత్తులో మన దేశానికి కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మక పోటీలు వచ్చేలా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ యువతను ప్రోత్సహించేందుకు, వారికి అద్భుతమైన అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన సీతారామ్ వారి కుటుంబ సభ్యులకు, సహకరించిన క్రీడా అసోసియేషన్ పెద్దలకు, మీడియా మిత్రులకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందనలు తెలియజేశారు.

అనంతరం గుడిపాటి ఫౌండేషన్ చైర్మన్ గుడిపాటి సీతారాం మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించిన ఈ పోటీలకు విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్ర తెలంగాణకు చెందిన క్రీడాకారులు పెద్ద ఎత్తున ఈ పోటీలలో పాల్గొన్నారని పోటీలలో విజయం సాధించిన విజేతలకు 2 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేయడం జరిగిందన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని పోటీలు నిర్వహిస్తామని క్రీడారంగా అభివృద్ధికి క్రమంతో సహకారం అందిస్తామని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో ఏపీ బ్యాట్మెంటన్ అసోసియేషన్ కార్యదర్శి అంకమ్మ చౌదరి, ప్రముఖ సింగర్ శ్రీ లలిత , ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రసాద్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, దత్తు తదితరులు పాల్గొన్నారు.