అల్లర్లు సృష్ఠించే సూత్రదారుల పై చర్యలు తీసుకోవాలి.... ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ డిమాండ్
విజయవాడ ...హిందూ దేవాలయ భూముల రక్షణ, అక్రమణల నివారణ శిధిలావస్థ లో ఉన్న ఆలయాలు పునఃనిర్మాణం మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలనపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ లలో వినతిపత్రాల ను సమర్పించినట్లు ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ వెల్లడించారు.
ఈమేరకు ప్రకటన మీడియా కు విడుదల చేశారు
భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మాకం గా నిర్వహిస్తున్న కార్యక్రమం "జనతా వారధి" ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్న గ్రామ నగర పర్యటనల్లో హిందు ఆలయాలు ధర్మకర్తలు మరియు భక్తులలో ఆందోళనలు కనిపించాయని మాధవ్ పేర్కొన్నారు
హిందూ దేవాలయాలు మన సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. ఈ ఆలయాలకు చెందిన లక్షల ఎకరాల భూములు దేవుని ఆస్తులు, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలు.
ప్రస్తుతం ఈ భూముల విషయంలో జరుగుతున్న పరిణామాలు హిందూ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇటీవల ఆకివీడు రామాలయ పునఃనిర్మాణం లో జరిగిన అల్లర్లు, నవమి రోజున జరిగిన దాడులు స్వయంగా స్పీకర్ నే హత్య చేయాలనుకునే ప్రయత్నం కొందరికి తీవ్రమైన గాయాలు పై యావత్ హిందు సమాజం ఆందోళనకు గురవుతుంది.
ఇటువంటి అల్లర్లు ప్రోత్సహించే సూత్రదారులపై చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాము.
సంవత్సరాలు గా ఆలయాల పునఃనిర్మాణాలు జరగకపోవడం వలన హిందు సమాజం నష్టపోతుంది. రాష్ట్రంలో శిధిలావస్థలో ఉన్న అన్ని ఆలయాలు పునర్ నిర్మించాలి.
హిందు ఆలయాల మొత్తం భూమి సుమారు 4.7 లక్షల ఎకరాలు, 1.5 లక్షల ఎకరాలు అక్రమణకు గురయ్యాయి,
అభివృద్ధి పేరు తో 8000 ఎకరాలు ప్రభుత్వం తీసేసుకుంది. లక్షల కోట్ల విలువ చేసే భూములు హిందు ఆలయాల నుంచి మల్లించబడుతున్నాయి మరియు ఆక్రమించబడుతున్నాయి.
దేవాలయాలకు సంబంధించిన లక్షన్నర ఎకరాలకు పైగా భూములు “ప్రైవేట్ వ్యక్తుల సర్వే నంబర్లలో కలిసిపోయాయి” అనే పేరుతో సరైన ధర్యాప్తు చేయకుండా, ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఇది హిందూ సమాజానికి, ఆలయ రక్షణకు తీవ్రమైన ప్రమాదకరం. ఈ చర్యలు ద్వారా ఆలయాలు తీవ్రంగా నష్టపోతాయి
33 సంవత్సరాల దీర్ఘకాలిక లీజుల పేరుతో అర్బన్ ప్రాంతాల్లో ఉన్న దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనే విధానం కూడా పూర్తిగా వ్యతిరేకించదగినది. ఈ నిర్ణయం వల్లే హిందూ సమాజం కోర్టులను ఆశ్రయించి స్టే ఆదేశాలు తెచ్చుకోవలసిన పరిస్థితి వచ్చింది.
హిందూ ఆలయ భూములు అభివృద్ధి పేరుతో ఇతరుల చేతుల్లోకి వెళ్లడం అంగీకారయోగ్యం కాదు.
హిందూ ఆలయ భూములు ఆలయాలకే చెందాలి ఇదే భారతీయ జనతా పార్టీ స్పష్టమైన అభిప్రాయం. ఇంకా, ఆలయ భూములను ఆక్రమించుకున్న వారికి రెగ్యులరైజేషన్ పేరుతో చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఆలోచించడం కూడా అత్యంత ప్రమాదకరం. ఇది అక్రమాలను ప్రోత్సహించడమే అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది. ఆలయ భూముల రక్షణలో కూడా ఆ పారదర్శకత ఉండాలని భక్తులు కోరుతున్నట్లు మాధవ్ పేర్కొన్నారు
ప్రస్తుతం పరిస్థితులు చూస్తే, గత ప్రభుత్వ ఆలోచనలు కొనసాగిస్తూ కొంతమంది అధికారులలో ఆలయ భూములను రక్షించాలనే దృక్కోణం కాకుండా, వాటిని దారి మళ్లించాలి, దోచిపెట్టాలి అనే ధోరణి కనిపించడం హిందూ సమాజాన్ని తీవ్రంగా బాధిస్తోంది. ఇటువంటి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేము.
దేవాలయాల ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ, అదే ఆలయాల అభివృద్ధి, పండుగల నిర్వహణకు ప్రభుత్వం సరైన మద్దతు ఇవ్వకపోవడం కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. అలాగే ఆలయ అదాయాల నుంచి కామన్ గుడ్ ఫండ్, అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ప్రభుత్వం తీసుకుంటుంది.
భారతీయ జనతా పార్టీ అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది...
• దేవాలయ భూములపై పూర్తి స్థాయి సర్వే నిర్వహించి, ప్రైవేట్ సర్వే నంబర్లలో కలిసిపోయిన భూములపై నిష్పక్షపాత ధర్యాప్తు చేయాలి.
• దేవాలయ భూములను ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలి.
• దీర్ఘకాళిక లీజుల కాకుండా స్వల్పకాలిక లీజులపై దృష్టి పెట్టాలి..
• ఆలయ భూముల ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసే ఆలోచనను ప్రభుత్వం పునఃపరిశీలించాలి.
• అక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుని భూములను తిరిగి ఆలయాలకు అప్పగించాలి.
• దేవాలయాల ఆదాయం పూర్తిగా అదే ఆలయాల అభివృద్ధికి వినియోగించే విధంగా చట్టపరమైన హామీ ఇవ్వాలి.
• ఆలయాల పండుగల నిర్వహణకు ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించాలి.
• CGF నిధులతో శిధిలావస్థ ఆలయాలు పునఃరుద్దరించాలి.
• అభివృద్ధి పేరుతో ఇప్పటివరకు ప్రభుత్వం తీసుకున్న భూమికి తగిన భూమి లేదా నష్టపరిహారం ఆయా ఆలయాలకు ఇవ్వాలి.
• హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.
ఇది కేవలం వినతిపత్రం కాదు హిందూ సమాజం యొక్క గళం. దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటుంది అని భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్నది హిందూ దేవాలయ భూముల మరియు రక్షణ, అక్రమణల నివారణ శిధిలావస్థ లో ఉన్న ఆలయాలు పునఃనిర్మాణం మరియు ప్రభుత్వ విధానాల పునఃపరిశీలన ఆలయ భూములు కాపాడాలి అవి ఆలయాలకే చెందాలి అని హిందువులపై జరుగుతున్న డాడులను నిరోధించాలని అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కోరుచున్నది.